బీజేపీ ఆపరేషన్ వైసీపీ - ఆట మొదలు, జగన్ వాట్ నెక్స్ట్..!!

ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయింది. బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. అటు కేంద్రంలోనూ మోదీ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ కీలకంగా మారుతోంది. దీంతో..వైసీపీ లక్ష్యంగా ఢిల్లీ నుంచి కొత్త ఆపరేషన్ ప్రారంభం కానుందనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే జగన్ ఆలోచన ఏంటి. ఏం చేయబోతున్నారు.

ఆపరేషన్ వైసీపీ
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కార్తీ చిదంబరం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బీజేపీకి వైసీపీ తొలి లక్ష్యంగా మారబోతోందని ఆయన ట్వీట్ చేసారు. వైసీపీ 2019-24 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మద్దతుగా నిలిచింది. కేంద్రం సైతం జగన్ కు అదే విధంగా ఏపీ విషయాల్లో సహకారం అందించింది. మోదీ - జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఇక, చంద్రబాబుతో బీజేపీ స్నేహం కుదుర్చుకున్న తరువాత లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవటంతో పాటుగా లోక్ సభ లో కేవలం నాలుగు ఎంపీలనే దక్కించుకుంది.

operation Lotus BJP targets YSRCP MP s trouble deepens for Jagan

బీజేపీ కొత్త గేమ్
అయితే, రాజ్యసభలో మాత్రం వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. పెద్దల సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. గత పదేళ్ల కాలంలో బీజేపీ జాతీయ, పలు రాష్ట్రాల్లో చేసిన రాజకీయం ఇప్పుడు ఏపీలో పలువురు విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్దిగా ఉండటంతో..బీజేపీ పైన చంద్రబాబు ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో..వైసీపీతోనే బీజేపీ ఆపరేషన్ ప్రారంభం అవుతుందనేది కార్తీ చిదంబరం ట్వీట్ సారాంశం. అయితే, వైసీపీ అవసరమైన సమయంలో బీజేపీకే మద్దతుగా నిలుస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. దీంతో..ప్రత్యేంగా వైసీపీ నేతలకు తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం లేదనే వాదన విపిపిస్తోంది.

operation Lotus BJP targets YSRCP MP s trouble deepens for Jagan

జగన్ ఏం చేయబోతున్నారు

కేంద్రంలో సంఖ్యా పరంగా ఎన్డీఏ ప్రస్తుతానికి సురక్షితంగానే ఉంది. కానీ, భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా..ముందుగానూ ప్రత్యామ్నాయంగా మరింత మంది మద్దతు దక్కించుకొనేలా బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుందనేది మరో విశ్వేషణ. అందులో భాగంగానే 2019 ఎన్నికల తరువాత టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయిన విధంగా వైసీపీ ఎంపీల పైన ఆ ఒత్తిడి ఉంటుందనే చర్చ పొలిటి కల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం కొనసాగిస్తున్న బీజేపీ ఈ విడత అలాంటి చర్యలకు తొందర పడదనే వాదన కూడా ఉంది. దీంతో..ఇప్పుడు బీజేపీ నాయకత్వం వైసీపీ విషయంలో ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+