రామకృష్ణ లక్ష్యంగానే ఒడిశా ఎన్ కౌంటర్:తప్పించుకున్న ఆర్. కె
విశాఖపట్టణం : రామకృష్ణ... మావోయిస్టు కీలక నాయకుడు. , .మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహారిస్తున్నారు. అనేక సార్లు పోలీసుల ఎన్ కౌంటర్ల నుండి తృటిలో తప్పించుకొన్నారు ఆయన.చిక్కినట్టే చిక్కి చేజారిపోయారని పోలీసు బాస్ లు పలుమార్లు అంతర్మథనం చెందారు. ఎ ఓ బి లో జరిగిన ఎన్ కౌంటర్ రామకృష్ణ లక్ష్యంగానే సాగిందని సమాచారం.
మావోయిస్టు కీలక నాయకుడు రామకృష్ణ లక్ష్యంగా చేసుకొని పోలీసులు వేటను సాగించారు. ఎఓబిలో జరిగే ప్లీనరి సమావేశంలో ఆర్ కె పాల్గొనే అవకాశం ఉందని తేలడంతో పోలీసులు వేట ను ప్రారంభించారు.అక్కిరాజు హారగోపాల్ అలియాస్ రామకృష్ణ పేరు చెబితేనే పోలీసులు ఆందోళన చెందుతారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ తో పాటు ఏఓబిలో కూడ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహారించారు.

ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది మావోలు మరణించారు. కాని కీలక నాయకుడు రామకృష్ణ తప్పించుకొన్నారు.గతంలో ఏఒబీ కార్యదర్శిగా రామకృష్ణ పనిచేశారు..ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్నారు.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎ్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో జరిపిన చర్చల్లో రామకృష్ణ కీలకంగా వ్యవహారించారు.ఆర్ కె లక్ష్యంగా చేసుకొని గాలికొండ, తంతేవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కూడ ఆయన తప్పించుకొన్నారు. తొలుత ఈ ఎన్ కౌంటర్ లలో ఆయన మరణించారని ప్రచారం జరిగింది , కాని ఈ ఎన్ కౌంటర్ నుండి ఆయన తప్పించుకొన్నారని తర్వాత గుర్తించారు.
ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా జంత్రి పోలీస్ స్టేషన్ ఏరియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీకి ఆర్ కె హాజరుకానున్నారని సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ రూపొందించారు. పోలీసులకు చిక్కిన మావోల సానుభూతిపరుల ద్వారా సమాచారం సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా మావోల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొన్నారు. డిసెంబర్ లో నిర్వహించాల్సిన పిఎల్ జిఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు సమావేశం కానున్నారని సమాచారం అందుకొని పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆర్ కె తప్పించుకొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications