జగన్ ట్రాప్ లో చంద్రబాబు, పవన్ -అష్టదిగ్బంధం, ఢిల్లీ క్లారిటీ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా వేర్వేరుగా సాధ్యం కాదని గుర్తించిన చంద్రబాబు, పవన్ ఏకం అయ్యారు. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. ఆట మొదలు పెట్టారు. సమయం చూసి దెబ్బ కొట్టారు. ఇద్దరినీ అష్టదిగ్భంధనం చేసారు. ఇదే సమయంలో ఢిల్లీలోనూ తన వ్యూహాలను పదును పెట్టారు. ఫలితంగా ఎన్నికల వేళ ఏపీ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.
జగన్ ఆపరేషన్ 2024
ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆపరేషన్ 2024 ప్రారంభించారు. అన్ని అస్త్రాలు సిద్దం చేసుకున్నారు. కోట్లాది మంది ఓటర్లను తన ఓట్ బ్యాంక్ గా మలచుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో..ప్రతీ మాట అమలు చేసి తన విశ్వసనీయతను పెంచుకొనే ప్రయత్నం చేసారు. అదే సమయంలో సంక్షేమం అమల్లో అవినీతికి ఆస్కారం లేకుండా..విమర్శలకు తావు లేకుండా చేసారు.

ఇప్పుడు అదే సంక్షేమం చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది. జగన్ సంక్షేమాన్ని విమర్శించిన టీడీపీ..జనసేన సైతం ఇప్పుడు తాము అదే సంక్షేమం కొనసాగిస్తామని హామీలు ఇస్తున్నారు. టీడీపీ సంక్షేమ మనిఫెస్టోను ప్రకటించింది. కానీ, జగన్ అందిస్తున్న సంక్షేమం ముందు టీడీపీ హమీలు నిలవలేదు. కనీసం ఎక్కడా చర్చకు రావటం లేదు. దీంతో, టీడీపీ - జనసేన వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్ ను డామేజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించాయి.
సమయం చూసి దెబ్బ
ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. సమయం చూసి దెబ్బ కొట్టారు. చంద్రబాబు పై అధికారంలోకి వచ్చిన సమయం నుంచి విచారణ సాగుతున్న కేసలు ఒక్క సారిగా కొత్త టర్న్ తీసుకున్నాయి. పూర్తి ఆధారాలతో సీఐడీ చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసింది. 44 రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్నారు. టీడీపీలో అనిశ్చితి కొనసాగుతోంది. చంద్రబాబు జైలులో ఉండటంతో పార్టీని నడిపించటంలో మిగిలిన నేతల్లో అనుభవ రాహిత్యం..సమన్వయ లోపం..వ్యూహాల లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తన సొంత పార్టీ ఎదుగుదల కంటే టీడీపీ బాగే ముఖ్యమనే విధంగా పవన్ పొత్తు ప్రకటన..తరువాతి నిర్ణయాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇక..టీడీపీతో పొత్తు తరువాత జనసేనలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ పవన్ తీరును నిశితంగా గమనిస్తోంది. ఏపీలో పరిణామాలపైన పూర్తి సమాచారంతో వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది.

ఆత్మరక్షణలో ప్రతిపక్షం
చంద్రబాబు ఇన్ని రోజులు జైలులో ఉండటం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఆశించిన సానుభూతి దక్కలేదు. ఇప్పుడు భువనేశ్వరిని ప్రజల్లోకి పంపిస్తున్నారు. తెలంగాణ, ఏపీ ఎన్నికల వ్యూహాలు అమలు చేయాల్సిన కీలక సమయంలో చంద్రబాబు జైలులో ఉన్నారు. బయటకు వచ్చినా..కేసులు..విచారణలు తప్పేలా లేవు. అటు పవన్ సైతం చంద్రబాబు కోసం బీజేపీకి దూరమైనట్లే కనిపిస్తోంది.
ఇదే సమయం లో జగన్ తన సైన్యాన్ని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. వరుస కార్యాక్రమాలు ప్రకటించారు. జనవరి నుంచి పధకాల లబ్ది దారుల ఖాతాల్లో వరుసగా నిధులు జమకానున్నాయి. పెన్షన్ 3వేలకు పెంచుతున్నారు. పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. సంక్షేమ ఓట్ బ్యాంక్ లో ఇప్పుడు చంద్రబాబు -పవన్ ఏం చెప్పినా..జగన్ దే పై చేయిగా కనిపిస్తోంది.
పక్కా వ్యూహాత్మకంగా సీఎం జగన్
ఇదే సమయంలో బీజేపీ నుంచి సహకారం అందే అవకాశం కనిపించటం లేదు. బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు చేయి అందించేందుకు సిద్దంగా లేరనది స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాల్లోనూ జగన్ ఆ రెండు పార్టీలను ఫిక్స్ చేస్తున్నారు. జనరల్ సీట్లలోనూ బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు, పవన్ పేదల వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు.
2018 ఎన్నికల సమయంలో జగన్ ట్రాప్ లో చిక్కుకున్న చంద్రబాబు బీజేపీకి దూరమయ్యారు. ఇప్పుడు అదే తరహాలో పవన్ సీఎం జగన్ ట్రాప్ లో పడి చంద్రబాబుకు దగ్గరయ్యారు. అదే బీజేపీకి దూరం చేస్తోంది. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టి..జగన్ తన సంక్షేమ ఓట్ బ్యాంక్ తో ముందుకు వెళ్తున్నారు. ఇదే తనకు అధికారం మరోసారి దక్కేలా చేస్తుందనే ధీమాతో కనిపిస్తున్నారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం..











Click it and Unblock the Notifications