మహిళల ఖాతాల్లోకి రూ.15 వేల నగదు - జమ చేయనున్న సీఎం జగన్..!!

ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తాను ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నారు. అందులో ప్రధానమైన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నగదును ఈ నెల 12న లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఇలా ఏటా రూ. 15,000 చొప్పున ఇప్పుడు రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12న ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమల తోపాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ళపాటు అందిస్తూ వారికి జీవనోపాధికి సహకారం అందిస్తున్నారు.

ebc-jagan

అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసారు. ఇక వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం మేనిఫెస్టోలో ప్రకటించలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారు. ఈ పథకం లబ్దిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర పథకాల లబ్దిదారులకు అమలవుతున్న నిబంధనలే ఇక్కడా అమలు చేస్తున్నారు.

వైఎస్సర్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా తొలి విడతలో రాష్ట్రంలోని 3.92 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ రూ.589 కోట్లు విడుదల చేసారు. ఈ పథకంలో లబ్దిదారులకు గ్రామాల్లో అయితే ఆదాయం నెలకు 10 వేలకు మించికూడదు. అదే పట్టణాలు అయితే ఈ పరిమితి 12 వేలుగా నిర్ణయించారు.

కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు. ఫ్యామిలీలో ఎవరికీ ఫోర్ వీలర్, పన్ను కట్టేవారు ఉండకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అర్హుల జాబితా సంబంధింత సచివాలయాల్లో సిద్దం చేసారు. అర్హత ఉండి ఎవరైనా జాబితాలో పేరు లేకపోతే సంబంధిత సచివాలయం సంప్రదించి పేరు ఆ జాబితాలో చేర్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+