Opinion:ఏపీలో పోలీసు శాఖను కంట్రోల్ చేస్తోన్న ఆ మాజీ డీజీపీ..?

రామ్ ప్రవీష్ ఠాకూర్.. 1986వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఏపీ డీజీపీగా కూడా అప్పటి చంద్రబాబు హయాంలో బాధ్యతలు చేపట్టారు.ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు.అయితే ఇప్పుడు ఈ మాజీ డీజీపీ ప్రస్తావన ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. విశ్వసనీ వర్గాల సమాచారం మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు.

పోలీసుశాఖలో పోస్టింగులను ఎవరు డిసైడ్ చేస్తారు..?
ప్రతీ సారి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు అధికారులను బదిలీ చేయడం లేదా వారికి స్థానచలనం కల్పించడం సర్వసాధారణం. ఇక ప్రభుత్వంలో అధికార యంత్రాంగం పటిష్టంగా ఉండేందుకు సొంత టీంను ఆయా ముఖ్యమంత్రులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులు లేదా వారితో సింక్‌ అయ్యేవారిని మాత్రమే తీసుకుండేలా జాగ్రత్త పడతారు.ఇక గత ప్రభుత్వంలో అప్పటి నాయకులకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటు వేయడం మామూలే.అయితే ఈ అధికారులను ఎవరు ఎంపిక చేస్తారు..? ఎవరి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందనేది ఎవరు డిసైడ్ చేస్తారు..? ముఖ్యమంత్రి తానే నిర్ణయం తీసుకుంటారా, లేక డీజీపీ పోస్టింగులను డిసైడ్ చేస్తారా, లేదా వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు నిర్ణయిస్తారా..?

OPINION RP Thakur EX-BUREAUCRAT OR DE-FACTO HOME MINISTER

మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పాత్ర ఏంటి..?
గత ప్రభుత్వంలో ఎస్ఐలు, సీఐలు,ఏసీపీల పోస్టింగులను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయం మేరకు జరిగేవని సమాచారం. ఇక డీఎస్పీ క్యాడర్‌కు మించిన ఆఫీసర్ పోస్టులను మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నిర్ణయించేది.అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు కనిపించడం లేదు.ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ హైదరాబాదులోని తన నివాసం నుంచి ఏపీలో ఏ పోలీసు అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలో నిర్ణయిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అప్పటి అధికారులను గుర్తించి వారిని ఎక్కడిక బదిలీ చేయాలి, ఏ పోస్టింగ్ ఇవ్వాలనేది మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ డిసైడ్ చేస్తున్నారట. దీంతో ఆయన మాజీ బ్యూరోక్రాటా లేక డీఫాక్టో హోం మినిస్టరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఉండగా.....
ఏపీకి పాలనా పరంగా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇంకా చెప్పాలంటే దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయనాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగా...బీహార్‌కు చెందినఒక మాజీ బ్యూరోక్రాట్ ఏ అధికారి ఎవరు ఎక్కడ ఏ బాధ్యత చేపట్టాలో డిసైడ్ చేయడమనేది ఆలోచించాల్సిన విషయం. ఇక మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చక్రం తిప్పుతుంటే ఇక రాష్ట్రానికి హోంమంత్రి అవసరం ఎందుకు అనే వాదన కూడా వినిపిస్తోంది.వన్‌ఇండియాకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పోలీసు అధికారుల బదిలీలు, వారికి ఇస్తున్న పోస్టింగుల వెనుక మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ హస్తం ఉందట. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

OPINION RP Thakur EX-BUREAUCRAT OR DE-FACTO HOME MINISTER

ఆర్పీ ఠాకూర్ పై విమర్శలు..?
ఆర్పీ ఠాకూర్ తన వద్ద ఉన్న స్వేచ్ఛతో తనకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్పీ ఠాకూర్ తన వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నారా లేక ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి వైపు నడిపేలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీని కూడా బలోపేతం చేసేందుకు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పనిచేస్తున్నారని ఆ పార్టీలోనే కొందరు గుసగుసలాడుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+