జగన్ ఓట్ బ్యాంకు లెక్క ఇదీ - ఆ ఇద్దరిలో అదే టెన్షన్, వై నాట్ 175..!!

వై నాట్ 175. సీఎం జగన్ ఎన్నికల నినాదం. ఎవరెవరు కలిసినా..ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా తనదే గెలుపు ఖాయమనే ధీమా. ఈ నమ్మకం వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయి. జగన్ నమ్ముకున్నది మామూలు ఓటు బ్యాంక్ కాదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రతిపక్షాలకు అడ్రస్ ఉండదు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచే మరో సారి పవర్ దక్కించుకోవటం పైన జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకున్నారు.

జగన్ సింగిల్ ఫైట్
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఒక వైపు..సీఎం జగన్ ఒక వైపు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి. పొత్తులు కడుతున్నాయి. ఆరోపణలు కొనసాగిస్తున్నాయి. సామాజికంగా ఓట్ బ్యాంక్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, జగన్ లో ధీమా మాత్రం తగ్గటం లేదు. ఎవరెవరు కలిసినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. తాను పొత్తులను నమ్ముకోలేదని..తాను నమ్ముకున్నది దేవుడు..ప్రజలను అని చెబుతున్నారు. ప్రతీ ఇంటి మంచి జరిగిందని నమ్మితే తనకు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. ఆ మంచి ఇప్పుడు జగన్ కు భారీ ఓట్ బ్యాంక్ గా మారింది.

 Jagan

సంక్షేమ ఓట్ బ్యాంక్
జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసారు. చెప్పనవి చేసారు. 2019 అధికారంలోకి వచ్చిన సమయం నుంచి విశ్వసనీయత పెంచుకొనేలా ప్రతీ మాట నెరవేరుస్తూ..సంక్షేమం పేరుతో ప్రతీ ఇంటికి దగ్గరయ్యారు. జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు...సంక్షేమ పథకాల లబ్ది దారులకు హామీ ఇచ్చిన విధంగా సాయం అందిస్తున్నారు. సామాజిక పెన్షన్లు..రైతు భరోసా మినహా అన్ని పథకాలు మహిళలకు అందుతున్నాయి. ఆ మహిళా ఓట్లే ఇప్పుడు జగన్ వై నాట్ 175 కి కారణమవుతున్నాయి. జగన్ అన్ని పథకాల లబ్దిదారుల సంఖ్య 3.98 కోట్ల మంది. అందులో పలు పథకాల్లో లబ్దిదారులుగా ఉన్న వారు ఉంటారు. పథకాలు అందుకుంటున్న వారిలో రాష్ట్రం మొత్తంగా 87 శాతం మందిగా లెక్కలు తేల్చారు.

 Jagans

అదే జరిగితే వై నాట్ 175
పథకాల విషయంలో జగన్ ఎన్ని కష్టాలు..ఇబ్బందులు వచ్చినా వెనకడుతు వేయలేదు. ప్రతీ ఇంటికి క్రమం తప్పకుండా లబ్ది అందుతోంది. అందులో ప్రధానంగా పెన్షనర్లు రూ 2750 చొప్పున అందుకుంటున్న వారి సంఖ్య 65 లక్షలు. ఆ తరువాతి స్థానంలో అమ్మ ఒడి లబ్ది దారులు 45 లక్షలు. రైతు భరోసా అందుకుంటున్న వారు 24 లక్షల మంది. పేదలకు ఇళ్ల పథకంలో లబ్ది దారులు 31 లక్షల మంది. అదే విధంగా వాహన మిత్ర..లా నేస్తం..జగనన్న చేదోడు వంటి లబ్దిదారులు ఉన్నారు. ఇక, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పూర్తి అనుకూలంగా మారారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. దీంతో..ఈ ఓట్ బ్యాంకు ను చూసిన ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. పొత్తులు తప్పవని నిర్ణయించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+