కెసిఆర్‌తో స్నేహం, మోడీ మొండిచేయి: చంద్రబాబుకు చిక్కులు

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో స్నేహం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చుపెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా తెలంగాణలోని కాంగ్రెసు కూడా చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే కెసిఆర్‌తో చంద్రబాబు స్నేహం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది.

అంతేకాకుండా, అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంపై కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఓటు నోటు కేసు నుంచి బయటపడడానికే ప్రధాని మోడీపై ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఒత్తిడి పెట్టడం లేదని విమర్శిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీ కూడా అదే విమర్శలు చేస్తున్నాయి.

కాగా, తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపైనే కాకుండా చంద్రబాబుపై కూడా ధ్వజమెత్తుతున్నారు. ఓటు నోటు కేసు నుంచి చంద్రబాబు, ఫోన్ ట్యాపింగ్ నుంచి కెసిఆర్ బయటపడడానికి ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందని షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తున్నారు.

Opposition attacks Chandrababu for compromising with KCR

ఇరువురి మధ్య రాజీ కుదిర్చిన మధ్యవర్తి ఎవరో తమకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు బయటపెడతామని షబ్బీర్ అలీ అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా స్వార్థం కోసం రాజీకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని వారంటున్నారు.

ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు కెసిఅర్ వద్ద మోకరిల్లారని ఆంద్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్రధానిపై ఒత్తిడి తేవడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు.

ఓ వైపు ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్న సమయంలోనే ఆర్టీసి చార్జీల పెంపు మరో వివాదాన్ని సృష్టించింది. ప్రత్యేక హోదానే కాకుండా ఆర్టీసి చార్జీల పెంపును కూడా తీసుకుని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+