కొండా సురేఖ నుండి షర్మిల వరకు జగన్ చేయిచ్చారా?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

తెలంగాణలో అక్క నుండి సీమాంధ్రలో సోదరి వరకు అందరికీ ఆయన చేయిచ్చారని విపక్షాలు అంటున్నాయి. గత కొంతకాలంగా జగన్‌కు సన్నిహితులుగా ఉన్న పలువురు దూరమైన విషయం తెలిసిందే.

తెలంగాణలో మాజీ మంత్రి కొండా సురేఖ, సీమాంధ్రలో సబ్బం హరి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు దూరమైన విషయం తెలిసిందే.

కొండా సురేఖ

కొండా సురేఖ

సురేఖ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. ఆమె ఆ పార్టీ తరఫునే పోటీ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డితో కొండా దంపతులకు మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్‌ను ఆమె అన్నలా చెప్పుకునే వారు. ఆయన మరణానంతరం కొండా సురేఖ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసులో ఉన్నప్పుడు కూడా జగన్ కోసం అసమ్మతి రాగం వినిపించారు. ఆ తర్వాత మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని, భర్త కొండా మురళీధర రావు ఎమ్మెల్సీ పదవిని జగన్ కోసం వదులుకున్నారు. అయితే ఆ తర్వాత వారు జగన్‌కు దూరమయ్యారు.

సబ్బం హరి

సబ్బం హరి

2009లో అనకాపల్లి నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన సబ్బం హరి.. కాంగ్రెసులోనే ఉంటూనే జగన్ రాగం ఆలపించారు. అయితే... ఆయన చేసిన ఓ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.. ఆయనతో తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. ఇప్పుడు సబ్బం జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలో నిల్చుకున్నారు.

 మారెప్ప

మారెప్ప

మాజీ మంత్రి మారెప్ప రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరారు. వైయస్ పైన అభిమానంతో ఆయన జగన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత దళితులకు సరైన న్యాయం జరగటం లేదంటూ ఆయన పార్టీని వీడారు. సమయం వచ్చినప్పుడల్లా జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు.

షర్మిల

షర్మిల

వైయస్ జగన్ చివరకి తన సోదరి షర్మిలకు కూడా చేయిచ్చారనే విమర్శలు వచ్చాయి. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆమె ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆమె కడప లోకసభ స్థానం ఆశించారు. దానిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. విశాఖ ఇస్తారని ప్రచారం జరిగినా.. ఈసారి ప్రచారానికే పరిమితమయ్యారు.

జగన్

జగన్

సురేఖ, సబ్బం, మారెప్ప, షర్మిలలను చూపించి జగన్ పైన దుష్ప్రచారం చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. షర్మిల ఎప్పుడు కూడా పోటీ చేయాలని భావించలేదని చెబుతున్నారు. అంతేకాకుండా.. కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తే కుటుంబ పాలన అంటారు, ఇవ్వకుంటే చేయిచ్చారని ఎలా అంటారని ప్రశ్నించే వారు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+