తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలతోపాటు RRR మూవీ దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు. అప్పటి నుంచి తెలుగులో విడుదలయ్యే సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
2023-24 సంవత్సరానికి సంబంధించి ఓర్ మ్యాక్స్ మీడియా మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాను ప్రకటించింది. తెలుగు సినిమాల జాబితాలో మొదటి స్థానంలో ప్రశాంత్ నీల్ -ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ నిలిచింది. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఉత్సుకతో ఎదురుచూస్తున్నట్లు ఓర్ మ్యాక్స్ వెల్లడించింది.

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 మూవీ కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది రెండోస్థానంలో నిలిచింది. ప్రాంతీయ సినిమాగా విడుదలైన పుష్ప1 దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా రెండో భాగం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. యంగ్ డైరెక్టర్ సుజిత్-పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న ఓజీ మూవీ మూడో స్థానంలో నిలిచింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరుకారం నాలుగో స్థానంలో నిలవగా, కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర మూవీ ఐదో స్థానంలో మోస్ట్ అవైటేడ్ టాప్ 5 తెలుగు సినిమాల్లో చోటు దక్కించుకున్నాయి.
ప్రభాస్ మరో చిత్రం కల్కి కోసం టాప్ -5లో చోటు దక్కలేదు. గూగుల్ సెర్చ్ సోషల్ పోల్స్ ద్వారా ఈ డేటా సేకరించినట్లు ఓర్ మ్యాక్స్ వెల్లడించింది. పాన్ ఇండియస్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీ లిస్ట్ లో కూడా పుష్ప, ఓజీ సినిమాలకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications