తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ లో ప్రభాస్
దేశవ్యాప్తంగా ఫేమస్ హీరోలు వీరేనంటూ... అంటూ ఓర్ మ్యాక్స్ సంస్థ నెలకోసారి జాబితాను విడుదల చేస్తుంటుంది. అభిమానులు కూడా తమ అభిమాన కథానాయకుడు ఆ జాబితాలో ఉన్నాడా? లేడా? అని తెలుసుకునేందుకు కచ్చితంగా దాన్ని పరిశీలిస్తుంటారు. తాజాగా జూన్ నెలకు సంబంధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్-10 హీరోల జాబితాను ఓర్ మ్యాక్స్ విడుదల చేసింది. దీని ప్రకారం 1 నుంచి 10వ స్థానం వరకు ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
ప్రభాస్... తెలుగు హీరో నుంచి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా.. అక్కడి నుంచి ప్రాజెక్ట్ కె సినిమాతో అంతర్జాతీయస్థాయి హీరోగా మార్పు చెందారు. చెందుతున్నారు. తనతో తీసే ప్రతి సినిమా అత్యధిక బడ్జెట్ వ్యయంతోనే రూపుదిద్దుకుంటోంది. బాహుబలి నుంచి సాహో అయినా, రాధేశ్యామ్ అయినా, ఆదిపురుష్ అయినా.. ఇలా ఏ సినిమా అయినా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మొదటి మూడురోజులు రోజుకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయడం అనేది ప్రభాస్ స్టామినాగా మారిపోయింది.

జాతీయస్థాయిలో ప్రభాస్ కు ఇప్పుడున్న స్టార్ డమ్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ కు కూడా లేదని చెప్పొచ్చు. ఇక ఆర్ మ్యాక్స్ జాబితాను పరిశీలిస్తే.. రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, మూడో స్థానంలో అల్లు అర్జున్, నాలుగో స్థానంలో రామ్ చరణ్, ఐదోస్థానంలో మహేష్ బాబు, ఆరోస్థానంలో పవన్ కల్యాణ్, ఏడో స్థానంలో నాని, ఎనిమిదో స్థానంలో చిరంజీవి, తొమ్మిదో స్థానంలో విజయ్ దేవరకొండ, పదోస్థానంలో రవితేజ నిలిచారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా, అక్కడి నుంచి గ్లోబల్ హీరోగాలు మారారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరో అయ్యారు. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటారా? అంతర్జాతీయస్థాయికి చేరుకుంటారా? అని అతని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications