ఇండియాలోనే టాప్ ప్లేస్ లో నిలిచిన సమంత
దేశవ్యాప్తంగా ఫేమస్ హీరోయిన్లు వీరే... అంటూ ఓఆర్ మ్యాక్స్ సంస్థ నెలకోసారి జాబితాను విడుదల చేస్తుంటుంది. అభిమానులు కూడా తమ అభిమాన కథానాయిక ఆ జాబితాలో ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు కచ్చితంగా దాన్ని పరిశీలిస్తుంటారు. తాజాగా జూన్ నెలకు సంబంధించిన జాబితాను ఓఆర్ మ్యాక్స్ విడుదల చేసింది. దీని ప్రకారం 1 నుంచి 10వ స్థానం వరకు ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు సమంతకు కేవలం ఒకే ఒక్క పాటతో వచ్చింది. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ తో దేశం మొత్తం సమంత ఫేమస్ అయిపోయింది. ఈ పాట గురించి తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత నుంచి వివిధ కారణాల రీత్యా సమంత టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తాజాగా విడుదల చేసిన లిస్టులో కూడా సమంతే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికి 8 సార్లు సమంత మొదటిస్థానాన్ని దక్కించుకుంది.

అలియాభట్ రెండో స్థానంలో, దీపికా పడుకొనే మూడోస్థానంలో, నయనతార నాలుగో స్థానంలో, కాజల్ అగర్వాల్ ఐదు, త్రిష ఆరు, కత్రినా కైఫ్ ఏడు, కియారా అడ్వాణీ ఎనిమిది, కీర్తి సురేష్ తొమ్మిది, రష్మిక మందన్న 10వ స్థానంలో నిలిచారు. అలాగే తెలుగు సినిమా వరకు పరిశీలిస్తే టాప్-10 జాబితాలో సమంత, కాజల్, అనుష్క, సాయిపల్లవి, కీర్తిసురేష్, శ్రీలీల, రష్మిక, పూజాహెగ్డే, తమన్నా, అనుపమ పరమేశ్వరన్ వరుసగా నిలిచారు.
సమంత సినిమాల నుంచి ఒక సంవత్సర కాలం విరామం తీసుకోవాలని భావిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. వీటికి ఊతమిచ్చేలా కొందరు నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్ కూడా తిరిగిచ్చేసినట్లు చెబుతున్నారు. మయోసైటిస్ తో బాధపడుతుండటంవల్ల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకుంది. అందుకనుగుణంగా ఏడాది కాలం షూటింగ్ లకు దూరంగా ఉండబోతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications