ఉస్మానియా దద్దరిల్లింది: చీకట్లోను చించేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేబినెట్ ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకొని, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో టపాసులు పేల్చి ఆనందం పంచుకున్నారు. ఉస్మానియా ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. చీకటి పడ్డా విద్యార్థులు లైట్ వెలుగులో ఎంజాయ్ చేశారు.
ఆరు దశాబ్దాల కల సాకారం అవుతుండటంతో ఉస్మానియా విద్యార్థుల ఆనందానికి అంతులేకుండా పోయింది. పరస్పరం మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇన్నాళ్లు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ఆందోళన పలువురిలో ఉంది.
కేబినెట్ నోట్‌తో అది కూడా తేలిపోవడంతో వారి మనసులు తేలికపడ్డాయి. ఇక అసెంబ్లీలో జరిగేది కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమేనని ఓటింగ్ ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ విభజనకు సహకరించాలని సీమాంధ్ర నేతలను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కోరుతున్నారు.

విద్యార్థులు 1
తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో బస్సులో కండక్టర్, ఇతర ప్రయాణీకులకు మిఠాయిలు తినిపిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు.

విద్యార్థులు 2
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం పైన జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు.

విద్యార్థులు 3
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం పైన జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు. చిత్రంలో పిడమర్తి రవి.

విద్యార్థులు 4
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం పైన జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు. జై తెలంగాణ నినాదాలు చేస్తున్న విద్యార్థులు.

విద్యార్థులు 5
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం వద్ద జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న విద్యార్థులు. జై తెలంగాణ నినాదాలు చీకట్లోనే ర్యాలీ తీస్తున్న విద్యార్థులు.

విద్యార్థులు 6
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం వద్ద జెండాలు ఎగురవేస్తూ నినాదాలు చేస్తున్న ఎబివిపి విద్యార్థులు.

విద్యార్థులు 7
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవనం వద్ద జెండాలు ఎగురవేస్తున్న ఎబివిపి విద్యార్థులు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

విద్యార్థులు 8
కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం వివిధ విద్యార్థి సంఘాలు ఒక్కచోటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం.

విద్యార్థులు 9
కేబినెట్ తెలంగాణ నోట్ ఆమోదం నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విద్యార్థులు గుమికూడి సంబరం చేసుకుంటున్న దృశ్యం.

విద్యార్థులు 10
ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కేబినెట్లో తెలంగాణ నోట్ ఆనందాన్ని జరుపుకుంటున్న తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు.












Click it and Unblock the Notifications