వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు చిక్కులు: విద్యార్థులు రోడ్డెక్కారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయానికి విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు.

శుక్రవారం ఓయు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తావరకు నిరుద్యోగ విద్యార్థులు ర్యాలీగా వచ్చి తార్నాక చౌరస్తాలో ధర్నాకు దిగారు. దీంతో పెద్దయెత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. విద్యార్థులు పెద్దయెత్తున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పోలీసులు విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో వారిని అరెస్టు చేయాలని ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు రెచ్చిపోయి పోలీసులతో వాగ్వివాదానికి, తోపులాటలకు దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణం చేటుచేసుకుంది.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓయు విద్యార్థులు శుక్రవారంనాడు ఆందోళనకు దిగారు.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

తార్నాకా చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త నెలకొంది. పోలీసులు లాఠీలకు పనికల్పించి ఆందోళనకు సారథ్యం వహిస్తున్న కొంత మంది విద్యార్థినాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కొంతమంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత తార్నాక చౌరస్తాలో విద్యార్థులు ఇంత పెద్దయెత్తున ఆందోళనకు దిగడం ఇదే ప్రథమం కావడం విశేషం.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

అనంతరం అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు పెద్దయెత్తున ఓయు పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు.

ఒయు విద్యార్థులు

ఒయు విద్యార్థులు

తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆందోళనలో పలు విద్యార్థి సంఘాలు పాలుపంచుకున్నాయి.

English summary

 Osmania University student took out rally from arts college to Tarnaka opposing Telangana CM K chandrasekhar Rao's decission to regularise contract employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X