రివర్స్: ఓయులో కెసిఆర్‌కు చేదు, 20ని.హెలికాప్టర్‌లోనే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేదు అనుభవం ఎదురయింది. విద్యార్థులు కెసిఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ఓయులోనే కెసిఆర్‌కు నిరసన సెగ తగలడం మింగుడు పడని విషయం.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమమబ్ధీకరిస్తామన్న కెసిఆర్ వ్యాఖ్యల పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కెసిఆర్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. దీంతో ఆయన హెలికాప్టర్ దిగకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. చిలకలగూడలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్‌లో ఓయుకు వచ్చారు.

అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గాన చిలకలగూడ వెళ్లాల్సి ఉంది. అయితే కెసిఆర్ రాక గురించి తెలిసిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో మైదానం వద్దకు చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గ్రౌండ్ లోపలకు వెళ్లకుండా గేట్లు మూశారు.
కెసిఆర్ హెలికాప్టర్ రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పైన ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థులతో మాట్లాడేందుకు ఆయన సుమారు ఇరవై నిమిషాల పాటు చూసినా.. వారు శాంతించలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications