జగన్ వల్లే: మండిపడ్డ మరో నేత, గీతకు మోడీ హామీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీకి చెందిన పైల నర్సింహయ్య శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. జగన్ నియంతృత్వ ధోరణి వల్లనే పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల దగ్ధం కోసం చేపట్టిన నరకాసుర వధను పార్టీ నేతలే వ్యతిరేకించారని చెప్పారు. బీసీలు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం నమ్మడం లేదన్నారు.
కొత్తపల్లి గీతకు మోడీ హామీ

లోకసభలో గురువారం తాను చేసిన ప్రసంగానికి మంచి ప్రతిస్పందన వచ్చిందని అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. సభ్యులందరూ తన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారన్నారు. ప్రసంగం ముగిసిన వెంటనే తోటి మహిళా ఎంపీలు తనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరి రక్షణకు చట్టాలు చేసే పార్లమెంటు తనకు మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
ఫేస్‌బుక్‌లో అసభ్యపదజాలంతో తనపై జరిగిన దాడిని ప్రధానమంత్రి మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లానని తెలిపారు. మోడీ కూడా తనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారన్నారు. 'నేను నీ సోదరుడిని... నిన్ను కాపాడే బాధ్యత నాది' అని మోడీ తనకు మాటిచ్చారని కొత్తపల్లి గీత చెప్పారు.












Click it and Unblock the Notifications