20 కోట్లివ్వాలని టిడిపి ఎంపీకి బెదిరింపు కాల్స్, అరెస్ట్

దీనిపై ఎంపీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోని అల్వాల్ సమీపంలోని వెంకటాపురం భూదేవినగర్‌కు చెందిన ముప్పై అయిదేళ్ల దేవేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతనిని విచారించగా ఎంపీను తాను బెదిరించినట్లు అంగీకరించాడు. నిందితుడిని రిమాండుకు తరలించారు. కాగా, ఎంపీ మల్లారెడ్డికి మావోయిస్టు పేరుతో ఫోన్ చేసిన ఆగంతుకుడు రూ 20 కోట్లను తమ పార్టీకి విరాళంగా ఇవ్వాలని, లేకపోతే మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలను పేల్చివేస్తామని హెచ్చరించాడు.
ఈ బెదిరింపు కాల్స్ పదేపదే వస్తుండటంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కాయిన్ బాక్స్‌లనే వినియోగించాడు. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications