కలకలం: తిరుమలలో పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు?
తిరుపతి: తిరుమలలో పాకిస్థాన్ జెండా కలకలం సృష్టించింది. పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జెండాను వదిలి వెళ్లారు.
నెలవంక, నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గుర్తించారు. ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలియజేశారు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు.. జపాలీ తీర్థం వద్దకు వెళ్లి ఆ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉరుసు ఉత్సవాల్లో దర్గాల వద్ద కట్టే జెండానా? లేక పాకిస్థాన్ జెండానా? అనే విషయంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.
ఇది ఇలా ఉండగా, మరికొందరు అదే ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండాలు కూడా కనిపించాయని పేర్కొంటుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications