యుద్ధం కోరుకోం కానీ, ఆర్మీని అనుమానిస్తారా, వీడియోలపై నో: వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్‌కు చెందిన వీడియోలు విడుదల చేయాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్‌కు కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు బుధవారం నాడు కౌంటర్ ఇచ్చారు. దాడి వీడియోలు విడుదల చేయాలనే డిమాండ్లు పట్టించుకోమన్నారు.
దురదృష్టవశాత్తు కొందరు రాజకీయ నాయకులు పాకిస్తాన్ వాళ్ల వలె మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తాము ఎవరితోను యుద్ధాన్ని లేదా సంఘర్షణను కోరుకోవడం లేదన్నారు. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం గట్టి సమాధానం చెబుతామన్నారు.
ఇటీవల మన జవాన్లు చెప్పిన సమాధానమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇతరులను పదేపదే విసిగించేందుకు కూడా కొంతమంది జనం ఉంటారని, వాళ్లను తాము నిశ్సబ్దంగా డీల్ చేస్తామని చెప్పారు. మన ఆర్మీ కూడా నిశ్సబ్దంగానే సర్జికల్ స్ర్టయిక్ దాడి చేసిందన్నారు.

సర్జికల్ స్ట్రయిక్ వీడియోలను విడుదల చేయాలన్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీరును ప్రస్తావిస్తూ.. అలాంటివాళ్లు చేసే బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. మనం సైన్యం పైన అనుమానాలు అవసరం లేదన్నారు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తారా అని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రయిక్స్ పైన ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు.
బాధ్యతా రహిత వ్యాఖ్యలు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. భారత సైన్యం నిబద్ధతను ఏ ఒక్క భారతీయుడు శంకిస్తాడని నేను భావించనన్నారు. భారత సైన్యం గొప్ప పని చేసిందన్నారు. యావత్ దేశం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచమంతా భారత సైన్యం దాడులను గుర్తించిందన్నారు. పాకిస్థాన్ మాత్రమే బుకాయిస్తోందని, ఏదో ఒకటి చెప్పాలిగా అన్నారు.
కనీసం తమ దేశ పౌరుల అంత్యక్రియలు చేసేందుకు కూడా పాకిస్థాన్ సిద్ధంగా లేదని, అదీ వారి సంస్కృతి అన్నారు. పాకిస్థాన్ తేలు కుట్టిన దొంగలా ఉందన్నారు. సర్జికల్ స్ట్రయిక్ దాడుల ద్వారా అవరోధాలు కలిగించాలని కొందరు చూస్తుంటారని, సైన్యం దాడులు చేసినట్లే మౌనంగా ఎదుర్కొంటామని, ఎవరైనా రెచ్చగొడితే జవాన్లలా ధీటైన జవాబు ఇస్తామన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications