పొన్నాలపై పాల్వాయి ఫైర్, తప్పుకుంటా: జగన్ అభ్యర్థి

సిపిఐకి కేటాయించిన మహేశ్వరం సీటును ఆఖరు నిమిషంలో మల్‌రెడ్డి రంగారెడ్డికి రూ.5 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి టిపిసిసి పదవి దక్కేందుకు ప్రయత్నించానని, ఆయన పేరు దాదాపు ఖరారైన సమయంలో పొన్నాల డబ్బులు పెట్టి ఆ పదవి దక్కించుకున్నారన్నారు.
మహేశ్వరం సీటును విషయమై ఏఐసిసి అద్యక్షులు దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశానన్నారు. తన ఫిర్యాదుకు దిగ్విజయ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారన్నారు. ఎన్నికల తర్వాత ఆ లేఖను బయటపెడతానని చెప్పారు.
ఏకగ్రీవంపై జగన్ పార్టీ అభ్యర్థి సవాల్
తెలంగాణ అమరవీరుడి తల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణపై మీకు, కాంగ్రెస్‌కి నిజమైన ప్రేమ ఉంటే హుజూర్‌నగర్‌లో శంకరమ్మను ఏకగ్రీవం చేద్దామని, అందుకు మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శ్రీకాంత్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications