సిఎం బేవకూఫ్, రజ్వీలాగా తరుముతాం: పాల్వాయి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓ బేవకూఫ్ అని, కాసిం రజ్విని తరిమినట్లు తరుముతామని రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మనిషి రూపంలో ఉన్న దెయ్యమంటూ, సొమ్ముల కోసమే కుర్చీని పట్టుకుని వేలాడుతున్నాడంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పదవి కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా అడ్డగోలు గా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిధులన్నీ చిత్తూరుకు తరలించుకుంటూ తెలంగాణకు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. సీఎం అవినీతి లెక్క లు విభజన తర్వాతైనా తేలుస్తామని హెచ్చరించారు. కిరణ్, చంద్రబాబు, జగన్‌లు రాష్ట్రాన్ని దోచుకున్న కాడికి దోచుకున్నారని, ఇంకా తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కిరణ్ అక్రమాలపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి తాను కోర్టుకు వెళతానని మాజీమంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం ఎలాంటి అనుమతుల లేకుండానే రూ. 6వేల కోట్ల నాన్‌ప్లాన్ గ్రాంట్స్‌ను చిత్తూరు జిల్లాకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ నెలలోనే టెండర్లను తెరవాల్సి ఉండటంతో సీఎం ఆ పనులు ఆమోదం పొందేవరకు ఉండి, మొబిలైజేషన్ అడ్వాన్సులు పొంది ఆ తర్వాత రాజీనామా చేయాలని చూస్తున్నాడన్నారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications