ప్రకాశం జిల్లాలో TDPకి బిగ్ బ్రేకింగ్?

ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న పమిడి రమేష్ బాబు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. ఆయన జనసేనవైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ తో కలిసి నాదెండ్లను కలిశారు. దీంతో రమేష్ జనసేనలో చేరడం ఖాయమంటూ చర్చ మొదలైంది.

ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా దర్శిలో మాత్రం తెలుగుదేశం నెగ్గింది. దర్శి నగర పంచాయితీని దక్కించుకుంది. ఇది టీడీపీకి దక్కడంలో పమిడి రమేష్ పాత్ర ఎంతో ఉందని పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకోసం రమేష్ అహర్నిశలు కష్టపడ్డారని, పార్టీని బలోపేతం చేశారని చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం ఇక్కడ రమేష్ తర్వాత ఎవరినీ ఇన్ ఛార్జిగా నియమించలేదు. ఏడాది నుంచి ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు.

pamidi ramesh will join in janasena

తనకు పదవి లేకపోయినా సరే పార్టీలోనే కొనసాగుతాను అన్న రమేష్ అకస్మాత్తుగా నాదెండ్లను కలవడంతో జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీకి ఇక్కడ ఇన్ ఛార్జి కూడా లేకపోవడంతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని, అప్పుడు జనసేన తరఫున పోటీచేయవచ్చనే భావనతోనే ఆ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ-జనసేనతో పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని హైపర్ ఆదికి కేటాయిస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికారికంగా ప్రకటనేదీ రాకపోయినప్పటికీ పమిడి రమేష్ జనసేనలో చేరబోతున్నారంటూ నియోజకవర్గం మొత్తం వార్త రావడమే కాకుండా మనోహర్ ను కలిసిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+