జనసేన లోకి విశాఖ ముఖ్య నేత- సీటు పై హామీ..!!

ఏపీలో ప్రధాన పార్టీల్లోకి ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విశాఖ జిల్లా నేత పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరటం ఖాయమైంది. అక్కడ సీటు హామీ పొందిన తరువాతనే వైసీపీకి రాజీనామా చేసారు. తాజాగా పెందుర్తిలో తన అనుచరవర్గంతో సమావేశమైన పంచకర్ల రాజకీయ భవిష్యత్ పైన చర్చించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసారు.

ఇటీవల విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారు. వైసీపీలో అంతర్గత స్వేచ్ఛ లేనందుకు పార్టీ వీడినట్టు రమేష్ బాబు ప్రకటించారు. రమేష్ బాబు రాజీనామా పైన వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ సుబ్బారెడ్డి స్పందించారు.

Panchakarla Ramsh Babu

రాజీనామాకు ముందుకు సంప్రదించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో రమేష్ బాబు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. వారి నుంచి భవిష్యత్ రాజకీయ ప్రయాణం పైన చర్చించారు. ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని పంచకర్లకు హామీ ఇచ్చారు.

పంచకర్ల త్వరలో జనసేనలో చేరటం ఖాయమైంది. ఈ మేరకు అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 17 అమావాస్య తరువాత పవన్ కల్యాణ్ సమక్షంలో రమేష్ బాబు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసారు. గతంలో జిల్లాలో గంటాతో కలిసి ప్రయాణం చేసినా..ప్రతీ సందర్భంలో ప్రస్తుతం దూరం అయ్యారు.

వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి జనసేనలో హామీ దక్కినట్లు సమాచారం. ఆ తరువాతనే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన పంచకర్ల ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 లో ఓడిపోయారు. వైసీపీలో చేరిన రమేష్ బాబు..ఇప్పుడు ఆ పార్టీ వీడారు. తాజాగా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+