వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును తిట్టే టైమ్ రైతు సమస్యలపై పెట్టండి .. మంత్రి కన్నబాబుకు పంచుమర్తి పంచ్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి మాట అటుంచి ఏపీలో అధికార , ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న మంత్రి కన్నబాబు చంద్రబాబు ఉచిత సలహాలు మాని రెస్ట్ తీసుకోవాలని చంద్రబాబు మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ మహిళా నేత, టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మంత్రి కన్నబాబు చంద్రబాబును తిట్టటానికి కేటాయించే సమయం రైతుల సమస్యల కోసం కేటాయించాలనిసెటైర్లు వేశారు.

కరోనా కాలంలో ఒక్కటైన జంటలు ... ఏడుగురు అతిధుల సాక్షిగా మూడు ముళ్ళ బంధంకరోనా కాలంలో ఒక్కటైన జంటలు ... ఏడుగురు అతిధుల సాక్షిగా మూడు ముళ్ళ బంధం

 చంద్రబాబు రెస్ట్ తీసుకోవాలన్న కన్నబాబు

చంద్రబాబు రెస్ట్ తీసుకోవాలన్న కన్నబాబు

కరోనా నివారణతో పాటు రైతులకు మేలు చేసేందుకు వైఎస్ జగన్ ఎంతో కృషిచేస్తున్నారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఇంత పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం హోం క్వారంటైన్‌లో కూర్చొని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు లేఖలు రాయడం మానుకొని రెస్ట్ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు . ఇక దీంతో కన్నబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అనూరాధ .

 ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు

ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు

కన్నబాబు వ్యవసాయ శాఖామంత్రిగా రైతుల కష్టాలు తీర్చటానికి ముందు పని చెయ్యాలని సూచించారు. చంద్రబాబుని తిట్టడానికి వినియోగించే సమయాన్ని రైతు సమస్యల కోసం వెచ్చించాలని పంచుమర్తి అనురాధ వ్యవసాయశాఖామంత్రి కన్నబాబుకి సూచించారు. ఒకపక్క కరోనా వల్ల ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు .

చంద్రబాబు గారిని తిట్టడానికి సమయం వెచ్చిస్తున్నారని మండిపాటు

చంద్రబాబు గారిని తిట్టడానికి సమయం వెచ్చిస్తున్నారని మండిపాటు

ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని తిట్టడానికి వెచ్చిస్తున్న సమయం రైతుల సమస్యలపై పెడితే కొంతైనా రైతులకు ఉపశమనం కలుగుతుంది అన్న విషయం ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు గుర్తిస్తే మంచిదని ఆమె హితవు పలికారు .ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోలేని స్థితిలో రైతులు ఉన్నారని, లాక్ డౌన్ వల్ల కనీసం రవాణా సౌకర్యం కూడా లేదని ఈ సమయంలో రైతుల వద్ద ఉన్న పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని సూచించారు . ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రైతులు అరటి పంటను అమ్ముకోలేక పొలంలోనే వదిలేసిన పరిస్థితి.

Recommended Video

YSRCP Dharna On Nannapaneni Rajakumari Comments || నన్నపనేని రాజకుమారి పై మండిపడుతున్న దళిత సంఘాలు
 రైతులకు పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలన్న అనూరాధ

రైతులకు పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలన్న అనూరాధ

అకాల వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయినా ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తుంది . ఇక ఈ సమయంలో అయిన ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు . యుద్ద ప్రాతిపదికన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని పంచుమర్తి మంత్రి ని కోరారు . ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయం, రైతులకు పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలని అనురాధ ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary
Kannababu has been advised to work as a minister of agriculture before the troubles of the farmers. panchumarthi Anuradha said to Minister of Agriculture, Kannababu that the time taken to abuse Chandrababu should be taken for the problems of the farmers. She has been criticized in her Twitter platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X