ముసలి వాళ్ళను మోసం చెయ్యటం మానుకో జగన్ రెడ్డి .. ఆ పింఛన్లు పునరుద్దరించు: పంచుమర్తి పంచ్

టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. ముసలి వాళ్ళని మోసం చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచి పోతారంటూ పంచుమర్తి అనురాధ జగన్ పై మండిపడ్డారు. పింఛను పెంపుపై మాట తప్పి, నిబంధనల పేరుతో పింఛన్లను తొలగించి వృద్ధులను మోసం చేసిన జగన్ అంటూ పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు.

 పింఛన్ల కోత విధించి వృద్ధుల కడుపు మాడుస్తున్నారు

పింఛన్ల కోత విధించి వృద్ధుల కడుపు మాడుస్తున్నారు

గురువారం మీడియాతో మాట్లాడిన పంచుమర్తి అనురాధ సీఎం జగన్ పింఛన్ మూడు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి మూడేళ్లు కావస్తుందని కనీసం 300 రూపాయలు కూడా పెంచకపోగా కుంటిసాకులు చెబుతూ ఉన్న పింఛన్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల కోత విధించి వృద్ధుల కడుపు మాడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైయస్సార్ భరోసా కాదు జగన్ రెడ్డి నమ్మకద్రోహం అని బహిరంగ ప్రకటన విడుదల చేసిన పంచుమర్తి అనురాధ ఎన్నికల ముందు జగన్ రెడ్డి చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి అంటూ నిప్పులు చెరిగారు.

ముసలోళ్ళ నోటి దగ్గర కూడు లేకుండా చెయ్యటం దుర్మార్గం

ముసలోళ్ళ నోటి దగ్గర కూడు లేకుండా చెయ్యటం దుర్మార్గం

ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంత మందికీ మూడు వేల రూపాయల చొప్పున పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి పింఛన్ అని, పింఛను ఇచ్చే సమయానికి ఇంట్లోనే ఉండాలని నిబంధనలు విధించి పింఛన్లను తొలగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముసలోళ్ళ నోటి దగ్గర కూడు లేకుండా చెయ్యటం దుర్మార్గం అంటూ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డికి ఆదాయం సృష్టించడం చేతకాక, పాలన అంటే ఏమిటో తెలీక, పేదల పెన్షన్లను లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు.

వైయస్సార్ భరోసా కాదు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం

వైయస్సార్ భరోసా కాదు జగన్ రెడ్డి నమ్మక ద్రోహం

వైయస్సార్ భరోసా అని పేరు పెట్టిన పథకానికి పేరు మార్చి జగన్ రెడ్డి నమ్మకద్రోహం అని పేరు పెట్టాలని పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో ముసలోళ్ళకు పెన్షన్ ఇచ్చి అండగా నిలబడ్డామని, ప్రతి నెల ఒకటో తారీఖున వారి ఖాతాలలో సొమ్ము జమ అయ్యేదని, కానీ ఇప్పుడు పెన్షన్ దక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఒక రేషన్ కార్డు లో ఇద్దరు పెన్షన్ దారుల పేర్లు ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇస్తామని చెప్పడం దారుణమని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెన్షన్ లు ఇవ్వడానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారని, ఒకవైపు రేషన్ కార్డులకు కేవైసీ పేరుతో వేధిస్తూ, మరో వైపు రేషన్ కార్డులలో ఇద్దరు, ముగ్గురు ఉన్నారని పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ హయాంలో పాలనా విధానాలివే

వైసీపీ హయాంలో పాలనా విధానాలివే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దౌర్జన్యం ,దుర్మార్గం, దగా తప్ప మరో విధానం లేకుండా పోయిందని అనురాధ విమర్శించారు. పేద ప్రజల రేషన్ కు, పెన్షన్ కు కోత పెడుతూ జగన్ రెడ్డి ఆదాయ మార్గాలు వెతుకుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. నాడు చంద్రబాబు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒక్కసారిగా 2000 చేస్తే, 3000 చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యాడని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.

ముసలి వాళ్ళను మోసం చెయ్యటం మానుకో జగన్ రెడ్డి

ముసలి వాళ్ళను మోసం చెయ్యటం మానుకో జగన్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వానికి అబద్దాలు చెప్పటం అలవాటుగా మారిందని, తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో 2019 మే నాటికి రాష్ట్రంలో 54.25 లక్షల మందికి పెన్షన్లు అందేవని, ఇక పెన్షనర్లకు వయోపరిమితిని తగ్గించడంతో, మరో ఆరు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు అయ్యాయని అనురాధ పేర్కొన్నారు. ఆ లెక్కన రాష్ట్రంలో మొత్తంగా 60 లక్షలకు పైగా పెన్షన్లు ఉండాలని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అంత మందికి పెన్షన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇకనైనా ముసలి వాళ్ళని మోసం చేయడం మానుకుని తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+