విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన:చెప్పులతో దాడి చేసిన తల్లిదండ్రులు
అనంతపురం:విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే తప్పు దోవ పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జాబితాలో మరో ఉపాధ్యాయుడు చేరాడు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడి చేసి చెప్పులతో కొట్టారు. అయితే పోలీసులు బాధితులైన విద్యార్థినుల పక్షం కాకుండా నిందితుడి వైపు మాట్లాడటంతో పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ప్రసార సాధనాల్లో ఎన్ని వార్తలు వస్తున్నా...ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా...వీటిపై అవగాహన ఉన్న అక్షరాస్యులు సైతం ఈ విధమైన అకృత్యాలకు తెగబడటంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు పాఠశాలలో ఇంగ్లీష్ నేర్పే ఉపాధ్యాయుడు చాలవేముల బాబు విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నేడు కూడా ఇదే ప్రవర్తన పునరావృతం కావడంతో సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి చెప్పులతో కొట్టారు.
అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉపాధ్యాయుని సమర్థిస్తూ గ్రామస్తులను అక్కడినుంచి చెదర గొట్టేందుకు ప్రయత్నించడం గ్రామస్తులు,పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇదేం అన్యాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications