విద్యార్థులకు టీచర్ల ప్రేమ పాఠాలు: ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

కర్నూలు: జిల్లాలోని దేవనకొండలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల వింత ప్రవర్తన విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. కొందరు ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెబుతున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ప్రేమ పాఠాలు చెబుతున్న సదరు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు ఉపాధ్యాయులను వెంటనే పాఠశాల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో డిఈఓ పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ ఉపాధ్యాయుల నిర్వాకంపై విచారణ చేపడతామని హామి ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.

Parents of students held a protest against school teachers

అనంతపురం: వ్యక్తిపై ఎలుగుబంటిదాడి

అనంతపురం: వజ్రకరూర్‌ మండలంలోని బోడసానిపల్లె దగ్గర ఓ వ్యక్తిపై ఎలుగుబంటిదాడి చేసింది. దాడిలో వ్యక్తికి తీవ్ర మైన గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరుగుతున్నాయన్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+