జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పరిటాల శ్రీరామ్, చివరి నిమిషంలో..!!

స్థానిక ఎన్నికల వేళ టీడీపీ ముఖ్య నేతల వారసులకు పదవులు దక్కుతున్నాయి. పలు ప్రాంతాల్లో వారసులను బరిలోకి దించారు. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయగా... జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియనుంది. కూటమిలో మూడు పార్టీల మధ్య జెడ్పీ ఛైర్మన్ల సీట్ల పంపకాల పైన చర్చ సాగుతోంది. ఇదే సమయంలో అనూహ్యంగా పరిటాల శ్రీరామ్ కు జెడ్పీ ఛైర్మన్ పదవి ఖాయమైంది. చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాలతో శ్రీరామ్ పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు టీడీపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గ నల్లచెరువు జెడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ బరిలో నిలవనున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి పరిటాల శ్రీరామ్ జెడ్పీటీసీకి నామినేషన్ దాఖలు చేసారు. 2024 ఎన్నికల్లో ధర్మవరం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. కాగా.. ఇప్పుడు జెడ్పీ ఛైర్మన్ పదవి శ్రీరామ్ కు కేటాయించారు. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి నియోజకవర్గ పరిధిలోకి నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం వస్తుంది. ఈ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో అక్కడి నుంచే ఆయన పోటీకి సిద్ధమయ్యారు.

బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
paritala-sriram-files-nomination-for-sri-sathya-sai-zp-chairperson-post-here-the-details

టీడీపీ నిర్ణయం వెనుక

కాగా.. పరిటాల శ్రీరామ్ కు 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన పరిటాల కుటుంబ వారసుడికి జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపవచ్చని టీడీపీ భావిస్తోంది. నల్లచెరువు నుంచి బరిలోకి దిగి భారీ ఆధిక్యంతో విజయం సాధించే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన పరిటాల శ్రీరామ్ వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో 25,575 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత ధర్మవరం లోనూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసారు. ఇక, ఇప్పుడు శ్రీరామ్ కొత్త బాధ్యతలకు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+