పరిటాల శ్రీరామ్ పెళ్లికి బాబు: మంచు లక్ష్మీ, వేణుమాధవ్‌లతో సెల్ఫీ కోసం...

మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ - జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగింది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు.

అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ - జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరుగుతోంది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు.

వధూవరులకు చంద్రబాబు ఆశీర్వాదం

వధూవరులకు చంద్రబాబు ఆశీర్వాదం

వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. సీఎం చంద్రబాబు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. మూడు లక్షల మంది వరకు వివాహానికి హాజరయ్యారని తెలుస్తోంది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 చంద్రబాబు చేతులు ఊపుకుంటూ

చంద్రబాబు చేతులు ఊపుకుంటూ

పెళ్లి వేడుకలో చంద్రబాబును చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ఆయన విక్టరీ సింబల్, చేతులు ఊపుకుంటూ ముందుకు కదిలారు.

మంచు లక్ష్మీతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు

మంచు లక్ష్మీతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు

సినీ ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. ప్రముఖ నటుడు మోహన్, బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మీ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటులు తారకరత్న హాజరయ్యారు. పెళ్లి వేడుకలో మంచు లక్ష్మి కనిపించగానే పలువురు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహపడ్డారు.

బాలకృష్ణ, వేణుమాధవ్ హాజరు

బాలకృష్ణ, వేణుమాధవ్ హాజరు

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబంతో సహా పెళ్లికి హాజరయ్యారు. నటుడు వేణుమాధవ్ కూడా వచ్చారు. మహిళా చైర్ పర్సన్ నందమూరి నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+