పరిటాల శ్రీరామ్‌కు ఊరట: కేసు కొట్టివేత
అనంతపురం: మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టులో ఊరట లభించింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అతనిపై నమోదైన కేసును బుధవారం న్యాయస్ధానం కొట్టివేసింది.
ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎలక్కుంట్లలో అప్పట్లో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారించిన ధర్మవరం కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టిందని తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు.
జిల్లాలో అక్రమంగా నిల్వచేసిన వేరుశనగ బస్తాల సీజ్
అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం చెట్టిచిన్నంపల్లెలో అక్రమంగా నిల్వచేసిన 430 వేరుశనగ బస్తాలను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications