డేట్ కూడా చెప్పేశారు: శ్రీరామ్ పెళ్లిపై పరిటాల సునీత క్లారిటీ, అమ్మాయి ఎవరంటే?
శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో పెళ్లి నిశ్చయమైందని అధికారికంగా ప్రకటించారు.
అనంతపురం: దివంగత టీడీపీ నాయకుడు పరిటాల రవి, ఏపీ మంత్రి పరిటాల సునీతల తనయుడు శ్రీరామ్ కు వివాహం నిశ్చయమైంది. గత కొద్దిరోజులుగా ఆయన పెళ్లిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా శ్రీరామ్ తల్లి సునీత ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
అక్టోబర్ 1న తన పెద్ద కుమారుడు శ్రీరామ్ పెళ్లి ఉటుందని పార్టీ కార్యకర్తల సమావేశంలో పరిటాల సునీత తెలిపారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె ఆలం జ్ఞానతో పెళ్లి నిశ్చయమైందని అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే, పరిటాల వారసుడిగా వచ్చే 2019ఎన్నికల్లో శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ ఉంటుందని చెబుతున్నారు. శ్రీరామ్ పెళ్లి తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications