అదే నా భర్తను చంపేలా చేసింది: జగన్‌పై సునీత, గాజులు తొడుక్కోలేదు: జలీల్‌ఖాన్
చంద్రబాబును కాల్చి చంపాలన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత నిప్పులు చెరిగారు. కాల్చి చంపే అలవాటు జగన్ సంస్కృతి అన్నారు.
అమరావతి: చంద్రబాబును కాల్చి చంపాలన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత నిప్పులు చెరిగారు. కాల్చి చంపే అలవాటు జగన్ సంస్కృతి అన్నారు.
జగన్ ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పరిటాల రవిని హత్య చేయించింది జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాదా అని నిలదీశారు.

నా భర్తతో సహా ఎంతోమందిని చంపారు, జగన్ అదుపులో ఉండు
తన భర్త పరిటాల రవితో పాటు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని సునీత ఆరోపించారు. హత్యా రాజకీయాలకు చంద్రబాబు వ్యతిరేకమని చెప్పారు. జగన్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు. జగన్ చంపే సంస్కృతే తన భర్తను హత్య చేయించిందన్నారు.
Recommended Video


గాజులు తొడుక్కోలేదు
జగన్ వయస్సు ఎంత, ఆయన అనుభవం ఎంత అని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. జగన్ పదేపదే సీఎం అవుతానని చెప్పడం మినహా, ప్రజా సేవ గురించి ఎప్పుడూ మాట్లాడరన్నారు. జగన్ మారకపోతే ఇక్కడ తాము గాజులు తొడుక్కొని లేమని, తగిన విధంగా బుద్ది చెబుతామన్నారు.

బాబు మంచి వ్యక్తి కాబట్టి
చంద్రబాబు మంచి వ్యక్తి కాబట్టి వైయస్‌పై ఉన్న గౌరవంతో జగన్‌పై జాలి చూపిస్తున్నామని జలీల్ ఖాన్ అన్నారు. ఇంకొకరు అయి ఉంటే ఈపాటికి జగన్ జైల్లో ఉండేవారన్నారు.

జగన్.. రాజారెడ్డి వారసుడు
రాజారెడ్డి వారసుడు జగన్ అని, అందుకే కాల్చాలి లాంటి పదాలు వస్తున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ప్యాక్షన్ మాటలతో ప్రజలకు ఎలాంటి సందేసం ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకోవాలన్నారు. నంద్యాలలో టిడిపి గెలుపు ఖాయమన్నారు.

తండ్రి వయస్సు ఉంది
తండ్రి వయస్సు ఉన్న చంద్రబాబును జగన్ విమర్శించడం విడ్డూరమని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు బేషరతు క్షమాపమ చెప్పాలని మరో టిడిపి నేత డిమాండ్ చేశారు. బెజవాడ బ్లేడు బ్యాచ్‌కు, జగన్ బ్యాచ్‌కు తేడా లేదన్నారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్నారు. జగన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications