వైభవంగా పరిటాల స్నేహలత పెళ్లి: సునీత భావోద్వేగం, దగ్గరుండి చూసుకున్న శ్రీరామ్

అనంతపురం: పరిటాల సునీత కూతురు డాక్టర్ స్నేహలత వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా వరుడు వధువు మెడలో తాళి కట్టారు. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నాయకులు, ఇతర ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యర్తలు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు.

ఘనంగా పెళ్లి

ఘనంగా పెళ్లి

పరిటాల స్నేహలత వివాహం శ్రీహర్షతో అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో జరిగింది. పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురంలో భారీ సెట్టింగ్‌తో వేదిక ఏర్పాటు చేశారు. బంధువులు, పరిటాల అభిమానులు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నడుమ ఘనంగా పెళ్లి జరిగింది.

పెళ్లికి హాజరైన వేలాదిమంది

పెళ్లికి హాజరైన వేలాదిమంది

పెళ్లి కుమార్తె స్నేహలతను సోదరులు పరిటాల శ్రీరామ్‌, సిద్దార్ధలు ఇంటి నుంచి పెళ్లి వేదిక వద్దకు పల్లకిలో తీసుకు వచ్చారు. చలువ పందిళ్ల కింద అతిథులు ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడంతో దాదాపు 30 వేలమంది వరకు వివాహానికి హాజరయ్యారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక నుంచి

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక నుంచి

మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, సుజయ్ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావుతో పాటు సినీ ప్రముఖులు మంచు విష్ణు తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక నుంచి కూడా చాలామంది అతిథులు తరలి వచ్చారు.

పరిటాల రవి సోదరి కొడుకు

పరిటాల రవి సోదరి కొడుకు

పరిటాల రవి సోదరి కుమారుడు శ్రీహర్షను వెంకటాపురంలోనే పెళ్లి కుమారుడిని చేసి సంప్రదాయబద్దంగా పెళ్లి మండపానికి తీసుకు వచ్చారు. అలాగే పరిటాల స్నేహలతను పెళ్లి కుమార్తెను చేసి పరిటాల రవ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

పరిటాల సునీత కన్నీటిపర్యంతం

పరిటాల సునీత కన్నీటిపర్యంతం

పరిటాల ఘాట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంత్రి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడున్న వారు చాలామంది ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సోదరులు స్నేహలతను కళ్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. వైభవంగా పెళ్లి జరిగింది.

దగ్గరుండి చూసుకున్న పరిటాల శ్రీరామ్

దగ్గరుండి చూసుకున్న పరిటాల శ్రీరామ్

పెళ్లికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు నలుగురు డీఎస్పీలు, తొమ్మిది మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 300 మందికి పైగా కానిస్టేబుళ్లు తదితరులను నియమించారు. పరిటాల శ్రీరామ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అతిథులకు నీరు, మజ్జిగ అందించారు. వేలాది మంది తరలి రావడంతో అందుకు తగిన భోజన, ఇతర ఏర్పాట్లు చేశారు. 30 రకాలకు పైగా వంటకాలు వడ్డించారు. పరిటాల శ్రీరామ్, సిద్ధార్థలు పెళ్లికి వచ్చిన వారిని పలకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+