అసెంబ్లీ క్యాంటీన్లో పరిటాల సునీత, పీతల: రుచి చూపించారు(పిక్చర్స్)
మంగళవారం ఉదయం ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే... మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్‌లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.
విజయవాడ: మంగళవారం ఉదయం ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే... మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్‌లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను పరిశీలించేందుకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత వచ్చారు.

మరింత బాగా చేస్తాం..
మహిళా మంత్రులు కిచెన్‌లోకి రాగానే పకోడీల ఘుమఘుమలు వారిని పలకరించాయి. ‘మేం మరింత బాగా వేస్తా'మంటూ ఇద్దరూ పిండి కలిపి, బాణలిలో పకోడీలు వేయించి, అందరికీ పంచారు. అనంతరం సచివాలయం ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

సరదాగా కాసేపు..
కాసేపు సరదాగా మహిళా ఉద్యోగులతో మంత్రులు మాట్లాడారు. మంత్రులు రాకతో ఏపీ సచివాలయ క్యాంటిన్ సందడిగా మారింది. క్యాంటిన్ సిబ్బంది వంటల గురించి మంత్రులకు వివరించారు.

సిబ్బందితో..
సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడుతున్న మహిళా మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.

విందు భోజనం
మహిళా మంత్రులు రాకతో ఏపీ సచివాలయ క్యాంటిన్ సందడిగా మారింది. క్యాంటిన్ సిబ్బంది వంటల గురించి మంత్రులకు వివరించారు. కాగా, మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలు సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

సందడిగా..
మహిళా మంత్రులు క్యాంటీన్‌కు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వంటల గురించి అడిగి తెసుకున్న మంత్రులు.. తమ పాక నైపుణ్యం చూపించారు. ఆ తర్వాత సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

ఘనంగా మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలు కేక్ కట్ చేశారు. అనంతరం పరిటాల సునీత, పీతల సుజాతలు కేక్ ఒకరికొకరు తినిపించుకున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications