ముద్రగడా! నా భర్తను లాగకు, బాబు నాకు దేవుడు: సునీత, బీజేపీ ఎమ్మెల్యే షాక్
అనంతపురం: రాజకీయ లబ్ధి కోసం తన భర్తను అనవసరంగా లాగవద్దని మంత్రి, టిడిపి నేత పరిటాల సునీత గురువారం నాడు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతమందిని చంపారో, ఆ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.
సీనియర్ నాయకుడు అయిన ముద్రగడ ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు తనకు దేవుడితే సమానమని చెప్పారు. పరిటాల రవి భద్రత కోసం ఢిల్లీకి కూడా వెళ్లారని పరిటాల సునీత చెప్పారు. ముద్రగడ దీక్ష వెనుక వేరే శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ముద్రగడకు ఆకుల మద్దతు
ముద్రగడ పద్మనాభంకు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మద్దతు పలికారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ముద్రగడకు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు తీసుకెళ్లారు. ఆయన వైద్య పరీక్షలను నిరాకరించారు. ఆయన ఆసుపత్రిలో ఉండగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు మద్దతు పలకడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ అని చెప్పవచ్చు. ఆయనకు అధికార పార్టీ లేదా టిడిపి మిత్రపక్షం బీజేపీ నుంచి పెద్దగా మద్దతు లేదు. కానీ ఆకుల సత్యనారాయణ మద్దతు పలకడం గమనార్హం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications