ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన మంత్రి పరిటాల సునీత(పిక్చర్స్)
రాయ్‌పూర్: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. గడియారి ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పని చేస్తున్న చౌకధరల దుకాణం నిర్వహిస్తున్న స్వయం సహాయక గ్రూపు సభ్యులతో పరిటాల సునీత, ఆమెతో పాటు వెళ్లిన ఏపి అధికారులు చర్చించారు.
ప్రజా పంపిణీ జరుగుతున్న తీరును వారు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తూకం, నిల్వ, పంపిణీ, సాంకేతికంగా అమలు చేస్తున్న పద్ధతులు తదితర వివరాలు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.
బుధవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను పరిటాల సునీత, అధికారులు కలిశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగుతున్న తీరు గురించి చర్చించారు. ఆహార ధాన్యాల సేకరణ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు చేరుతున్న తీరును ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వారికి వివరించారు. ఏపిలో ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఆయన మంత్రిని అడిగి తెలుసుకున్నారు.
ఏపి సిఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా రమణ్ సింగ్ ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్‌లో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ తీరును ఏపిలో అమలు చేసేందుకు సిఎం చంద్రబాబుతో చర్చిస్తామని సునీత తెలిపారు. మంత్రి వెంట ఏపి పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, డైరెక్టర్ రవిబాబు తదితరులు ఉన్నారు.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత బుధవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు.

పరిటాల సునీత
గడియారి ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పని చేస్తున్న చౌకధరల దుకాణం నిర్వహిస్తున్న స్వయం సహాయక గ్రూపు సభ్యులతో పరిటాల సునీత, ఆమెతో పాటు వెళ్లిన ఏపి అధికారులు చర్చించారు.

పరిటాల సునీత
ప్రజా పంపిణీ జరుగుతున్న తీరును వారు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించారు.

పరిటాల సునీత
ధాన్యం సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తూకం, నిల్వ, పంపిణీ, సాంకేతికంగా అమలు చేస్తున్న పద్ధతులు తదితర వివరాలు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

పరిటాల సునీత
బుధవారం సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను పరిటాల సునీత, అధికారులు కలిశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కొనసాగుతున్న తీరు గురించి చర్చించారు.












Click it and Unblock the Notifications