ఆ మోజుతో మాట్లాడుతున్నావు, సీఎం కాలేవు: జగన్‌కు పరిటాల సునీత హెచ్చరిక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును పదేపదే విమర్శించడాన్ని తప్పుబట్టారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును పదేపదే విమర్శించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మహిళా సంఘాల పదాధికారుల సమావేశంలో మాట్లాడారు.

Recommended Video

    మీరు సినిమాకు వెళ్తే మీకు విలన్ నచ్చుతాడా, నా లాంటి హీరో నచ్చుతాడా ?
    జగన్ పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

    జగన్ పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

    జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. ఆయన మహిళా సదస్సు నిర్వహించి సర్కారును విమర్శించారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏది పడితే అది మాట్లాడవద్దని జగన్‌ను హెచ్చరించారు.

    చంద్రబాబు కృషి చేస్తుంటే

    చంద్రబాబు కృషి చేస్తుంటే

    ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళా సంఘాల సభ్యులకు తాము ఒక్కొక్కరికి తాము రూ.6వేలు చెల్లించామన్నారు. మిగతా రూ.4వేలు కూడా త్వరలోనే చెల్లిస్తామ‌రు. మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి స్వయం సమృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే విమర్శలు సరికాదన్నారు.

    జగన్ ముఖ్యమంత్రి కాలేరు

    జగన్ ముఖ్యమంత్రి కాలేరు

    ముఖ్యమంత్రి సీటు పైన మోజుతో జగన్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని పరిటాల సునీత ధ్వజమెత్తారు. అలాగే, ఇష్టం వ‌చ్చిన‌ట్లు హామీలు ఇస్తున్నార‌న్నారు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరగడం తప్ప ఆయన ముఖ్య‌మంత్రి కాలేరని జోస్యం చెప్పారు.

    రూ.25 లక్షలు సద్వినియోగం చేసుకోవాలి

    రూ.25 లక్షలు సద్వినియోగం చేసుకోవాలి

    కాగా, ఒక్కో మహిళా సంఘానికి రూ.25 లక్షలు రుణంగా ఇచ్చిన ఆంధ్రాబ్యాంకుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘాల వారికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళా సంఘాల నేతలకు పసుపు, కుంకుమ కింద చీరలు పంపిణీ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+