కూటమి భవిష్యత్ కు ఆ రోజే కీలకం - ఆశలు ఫలించేనా..!!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వరుస గా మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఈ తొలి బడ్జెట్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఏపీ ఈ బడ్జెట్ వైపు ఆశగా చూస్తోంది. ఏపీ కూటమి ప్రభుత్వానికి ఈ బడ్జెట్ కీలకంగా మారుతోంది.
23న కేంద్ర బడ్జెట్
ఈ నెల 23న కేంద్రం 2024-25 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుంది. ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మిగిలిన ఎనిమిది నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఈ సారి బడ్జెట్ పైన ఏపీ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి అమలు చేయాల్సిన హామీలు .. రాజధాని వంటి సవాళ్లు కేంద్రం తోడ్పాటుతోనే సాధ్యమని భావిస్తున్నారు. దీంతో, తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన లోనూ పలు ప్రతిపాదనలు అందించారు.

ఏపీ ప్రభుత్వం ఆశలు
ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. ఆర్దికంగా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో ఇతర హామీల అమలు పైన ప్రభుత్వం ఆలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని ప్రాజెక్టుకు నిధుల సమీకరణ చేయాల్సి ఉంది. ఈ సమయంలో కేంద్రం తోడ్పాటు పైన ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఏపీకి సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర సాయంపై నమ్మకం
దీంతో, ఈ నెల 23న కేంద్రం ప్రతిపాదించే బడ్జెట్ అంచనాల్లో ఏపీకి సహకరించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉంటాయనే ఆశతో ఏపీలోని అధికార కూటమి నేతలు ఉన్నారు. రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితుల గురించి కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. రుణపరిమితి పెంపుతో పాటుగా గ్రాంట్ల పైన చర్చలు చేసారు. దీంతో..ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించే ఈ బడ్జెట్ ద్వారా ఏపీలో ప్రభుత్వం తమ హామీల అమలు..పాలనా పరంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. దీంతో..కేంద్ర బడ్జెట్ వైపు ఏపీ ఆసక్తిగా చూస్తోంది.












Click it and Unblock the Notifications