రాజధాని పేరుతో బెదిరింపులు: బాబుపై పార్థసారథి ఫైర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భయాందోళనలకు గురి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు మైండ్ సెట్ ఇప్పటికీ మారలేదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు.
రైతులను చులకన చేసి మాట్లాడడం చంద్రబాబుకు తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యాశ అంటూ రైతులను కించపరచడం చంద్రబాబుకు సమంజసం కాదని ఆయన అన్నారు. రాజధాని వస్తుందనే వార్తల కారణంగానే భూముల ధరలు బంగారంలా పెరిగాయని ఆయన ్న్నారు.

ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కావాలో, భూసేకరణ చట్టం ప్రయోగించమంటారో తేల్చుకోవాలని రైతులను ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పార్థసారథి విమర్శించారు ఇప్పుడు మల్లీ కాల్దరి, బషీర్‌బాగ్ కాల్పులు పునరావృతమవుతాయనే ఆందోళనకు రైతులు గురవుతున్నారని ఆయన అన్నారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే ల్యాండ్ మాఫియా పెట్రేగిపోతోందని, భూసేకరణ పేరుతో రైతులను బెదిరించడం సరి కాదని ఆయన అన్నారు. చేతనైతే కేంద్రాన్ని బెదిరించి రాజధానికి అవసరమైనవి సాధించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని పార్థసారథి చెప్పారు.












Click it and Unblock the Notifications