జగన్ వెంటే వంగవీటి: చంద్రబాబుపై పార్థసారథి నిప్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు దోచుకోవడానికి ఓ ఆయుధం పోలవరం ప్రాజెక్టు అని పార్థసారధి ఆరోపించారు. వైయస్సార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
'బంగారు గుడ్లు పెట్టే బాతు' సామెత లాగా గుడ్లన్నిటినీ ఒకేసారి మింగేయాలని చూస్తున్నారని చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు. అంతేగాక, పోలవరం ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరారు.

విపరీతంగా పెంచిన చంద్రబాబు
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి జరగని పనులు జరిగినట్టు, ఎడ్ హాక్ పేమెంట్స్ పేరిట తన కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించి, వాటిని మళ్లీ వేరే మార్గంలో చంద్రబాబు తీసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని మోడీకి ‘పోలవరం'పై ఓ లేఖ ఇచ్చారని, అందులో అంచనాలు విపరీతంగా పెంచేశారని పార్థసారథి విమర్శించారు.
Recommended Video


జాతీయ స్కాంగా..
పోలవరం ప్రాజెక్ట్ పనులను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన చంద్రబాబు.. దోపిడీకి కొత్త అర్థాలు చెబుతున్నారని అన్నారు. పోలవరాన్ని జాతీయ స్కాంగా మార్చారని పార్థసారథి దుయ్యబట్టారు.

విచారణకు ప్రధాని ఆదేశం
ఏడెనిమిదేళ్ల క్రితం పదివేల కోట్లతో ప్రారంభించిన ‘పోలవరం'ప్రాజెక్టు అంచనాలను నేడు 58 వేల కోట్లకు పెంచిన చంద్రబాబునాయుడు చేస్తున్నది ధన దోపిడీనా? ధన యజ్ఞమా? అనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని అన్నారు. పోలవరం అవకతవకలపై విచారణ జరపాలని ప్రధాని నీతి అయోగ్‌ను ఆదేశించారని పార్థసారథి చెప్పారు.

జగన్ వెంటే వంగవీటి..
చంద్రబాబు ధన దోపిడీని చూసి ప్రధాని కార్యాలయం అధికారులే నిర్ఘాంత పోయారని ఎద్దేవా చేశారు. వంగవీటి రాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలో వాస్తవం లేదని పార్థసారథి స్పష్టం చేశారు. వంగవీటి రాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అని, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత నేత అని అన్నారు.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications