Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టుడే స్పెష‌ల్‌: జ‌గ‌న్ అడ్డాలోకి చంద్ర‌బాబు : ప‌వ‌న్ ఆశ‌ల సౌధం లో జ‌గ‌న్ : ఇదీ అస‌లు కిక్కంటే..!

ఎన్నిక‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. ప్ర‌చారంలో ఒక‌రికి మ‌రొక‌రు ధీటుగా వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యం లో ప్ర‌ధాన పార్టీల అధినేత‌ల ప్ర‌చార ప‌ర్వం లో ఈ రోజు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త‌న‌కు తిరుగు లే ద‌ని భావిస్తున్న జ‌గ‌న్ అడ్డాలోకి చంద్ర‌బాబు కాలు పెడుతున్నారు. ఇక‌, త‌న గెలుపు ఖాయ‌మ‌ని ప‌వ‌న్ భావిస్తున్న భీమవ రం లో జ‌గ‌న‌క స‌త్తా చాట‌టానికి క‌దులుతున్నారు. ఇదీ ఎన్నిక‌ల వేళ అస‌లు కిక్కు...

పుల‌వెందుల‌కు చంద్ర‌బాబు..

పుల‌వెందుల‌కు చంద్ర‌బాబు..

వైయ‌స్ కుటుంబానికి ద‌శాబ్దాల కాలంగా వెన్ను ద‌న్నుగా నిలిచిన క‌డ‌ప జిల్లాలో టిడిపి అధినేత ప్ర‌చారం కోసం రం గం లోకి దిగుతున్నారు. ఇందుకోసం క‌డ‌ప జిల్లాలో సుడిగాలి ఎన్నిక‌ల ప్ర‌చారానికి చంద్ర‌బాబు స‌మాయ‌త్తం అయ్యా రు. వైసిపిఅధినేత జ‌గ‌న్ పోటీ చేస్తున్న పులివెందుల‌..రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ ఆస‌క్తి క‌లిగిస్తున్న జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రోజు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఆస‌క్తి క‌రంగా మారింది. వైయ‌స్ వివేకా హ‌త్య త‌రువాత రాజ‌కీయంగా ఈ జిల్లాలో ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు ఆదేశంతో ఈ అంశం ఎవ‌రు ఎత్త‌క‌పోయినా.. ఈ ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లాలో పై చేయి సాధించాల‌ని క‌సిగా ఉన్న చంద్ర‌బాబు ప్ర‌చారానికి ఎటువంటి జ‌న స్పంద‌న వ‌స్తుం ద‌నేది ఆసక్తి క‌రంగా మారింది. వివేకా మృతితో ఇప్పుడు భార‌తి అక్క‌డి బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

ప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోకి జ‌గ‌న్‌..

ప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలోకి జ‌గ‌న్‌..

యాక్ట‌ర్‌..పార్ట‌న‌ర్ అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను ప్ర‌చారం విమ‌ర్శిస్త‌న్న వైసిపి అధినేత జ‌గ‌న్ ఇప్పుడు ప‌వ‌న్ పోటీ చేస్తున్న భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారానికి దిగుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న గెలుపు ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్నారు. న‌ర్సాపురం లోక్‌స‌భ ప‌రిధిలో ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే భారీ మెజార్జీ ని త‌న అన్న‌కు వ‌చ్చేలా చేసి నాగ‌బాబు గెలుపు కోసం ఇక్క‌డే ఎక్కువ‌గా ఆధార ప‌డుతున్నారు. స‌రిగ్గా..ఇక్క‌డే ప‌వ‌న్ ను దెబ్బ కొట్ట‌లాని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇక్క‌డ వైసిపి నుండి గ్రంధి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. టిడిపి నుండి ఆంజ‌నే యులు పోటీ ప‌డుతున్నారు. ఇప్పుడు, భీమ‌వ‌రంలో జ‌గ‌న్ కు జ‌న స్పంద‌న ఎలా ఉంటుంది..ప‌వ‌న్ పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తార‌నేది రెండు పార్టీల నేత‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)

ఒన్ మ్యాన్ ఆర్మీగా ప‌వ‌న్..

ఒన్ మ్యాన్ ఆర్మీగా ప‌వ‌న్..

ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సైతం ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు. ఆయ‌న జ‌న‌సేన నుండి దాదాపు ఒన్ మ్యాన్ ఆర్మీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌న‌సేన కు మ‌ద్ద‌తుగా ప్ర‌ముఖులు ఎవ‌రూ ఇంకా రంగంలోకి దిగ‌లేదు. నాగబాబు న‌ర్సాపు రం ఎంపీగా బ‌రిలో ఉండ‌టంతో అక్క‌డే దృష్టి సారిస్తున్నారు. ఇక‌, వైసిపి నుండి జ‌గ‌న్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది. టిడిపి అధినేత‌కు మ‌ద్ద‌తుగా జాతీయ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌ధానంగా క‌డ‌ప జిల్లా పై చంద్ర‌బాబు...వ‌ప‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల పై జ‌గ‌న్‌.. త‌న ప్ర‌భావం చాటుకునేందుకు ప‌వ‌న్ మిగిలిన ఈ తొమ్మ‌ది రోజులు స‌ద్వినియోగం చేసుకొనేందుకు పోటీ పడుతున్నారు. ఇక‌, అస‌లు సిస‌లు రాజ‌కీయాల‌కు చిరునామా గా నిలి చే ఏపిలో ఈ రోజు ఈ ముగ్గురి ప్ర‌చారం అస‌లై ఎన్నిక‌ల కిక్కును ఎక్కించ‌నుంది..

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+