ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్ర - జగన్‌ 10 ఏళ్ల కష్టం : వైసీపీ నేతల వేడుకలు..!!

ముఖ్యమంత్రి జగన్ నాడు ప్రతిపక్ష నేతగా చేసిన ప్రజాసంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి కావటంతో పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ఒక చరిత్రగాప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు.క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. అన్ని వర్గాలనూ ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాల అమలుకు సీఎం జగన్‌ వెనుకాడలేదని గుర్తుచేశారు. సంక్షేమాన్ని అడ్డుకోవడమే ప్రతిపక్షానికి తెలిసిన రాజకీయమని మండిపడ్డారు.

ప్రజలు జగన్ వైపే నిలిచారు

ప్రజలు జగన్ వైపే నిలిచారు

ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌వైపే నిలిచారని సజ్జల అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పాదయాత్ర ద్వారా సీఎం జగన్‌ ప్రజలతో మమేకమయ్యారని పేర్కొన్నారు. అధికారం చేపట్టగాలనే సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ నడుంబిగించారని తెలిపారు. ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని దృఢ సంకల్పంతో జగన్ సంకల్ప పాదయాత్ర చేసారంటూ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

వార్‌ వన్‌సైడ్‌గా జగన్ గెలుపు

వార్‌ వన్‌సైడ్‌గా జగన్ గెలుపు

అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్‌ వన్‌సైడ్‌గా సీఎం జగన్‌కు విజయాన్ని అందిస్తున్నారు. ఆనాడు సీఎం జగన్‌ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు జగన్‌ వైపు నిలబడ్డారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవన్నారు.

10 ఏళ్ల కష్టం అందిరికీ తెలుసు

10 ఏళ్ల కష్టం అందిరికీ తెలుసు

ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌ 10 ఏళ్ల కష్టం ప్రజలందరికీ తెలుసని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పుకొచ్చారు. నాడు వైఎస్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారని గుర్తు చేసుకున్నారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారన్నారు.

పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఒక రికార్డుగా

పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఒక రికార్డుగా

కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యిందని చెప్పారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్‌ జగన్‌కే పట్టం కట్టారన్నారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+