ఆసుపత్రిలో వ్యక్తి వీరంగం: సినిమాకు డబ్బివ్వలేదని...

ఆవుపై చిరుత దాడి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గద్దెగూడెంలో ఆవుపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఆవు మృతి చెందింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్ని ప్రమాదం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ ద్వారం వద్ద ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగడంతో కలకలం రెగింది. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మాటలార్పేసింది. దీంతో ప్రమాీదం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు.
సినిమాకు డబ్బులివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
సినిమాకు వెళ్లేందుకు తల్లి డబ్బులివ్వలేదనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకుంది. నవీన్ అనే వ్యక్తి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు కావడంతో సినిమాకు వెళ్లేందుకు వంద రూపాయలు ఇవ్వమని అడిగాడు. అంత డబ్బు లేదని ముప్పై రూపాయలు ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications