వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆస్తులు 52 కోట్లు..అప్పులు 34 కోట్లు : జ‌న‌సేనాని ఆస్తుల చిట్టా ఇదే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : 34 కోట్ల అప్పులో పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్‌కు 2.4 కోట్లు..!! | Oneindia

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ అస్తులు 52 కోట్లు కాగా..అప్పులు 34 కోట్లుగా తేలింది. గాజువాక అసెంబ్లీ నుండి పోటీలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న నామినేష‌న్ లో ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం ప‌వన్ కళ్యాణ్ చరాస్ధుల వి లువ-రూ.12 కోట్లు కాగా, పవన్ కళ్యాణ్ స్ధిరాస్తుల విలువ రూ. 40.81 కోట్లు ఆ పేర్కొన్నారు. ఇక‌, పవన్‌కళ్యాణ్‌ అప్పులు ..రూ. 33.72 కోట్లు గా వెల్ల‌డించారు. ఇక‌, త‌న పవన్‌ భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ రూ.3.20 కోట్లు గా అఫిడ విట్ లో పేర్కొన్నారు. ఇక‌, ప‌వ‌న్ నెల్లూరు నుండి ప‌దో త‌ర‌గ‌తి చ‌దవిన‌ల్లు వెల్ల‌డించారు.

ప‌వ‌న్ ఆస్తుల చిట్టా ఇలా..

ప‌వ‌న్ ఆస్తుల చిట్టా ఇలా..

గాజువాక నుంచి అసెంబ్లీకి పోటీకి నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్‌తో పాటు ఆస్తుల వివ‌రాల‌ను జ‌త చేసారు. పవన్ కళ్యాణ్ స్థిర, చరాస్తుల విలువ రూ.52 కోట్లు ఉండగా, అప్పులు రూ.34 కోట్లుగా చూపారు. పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా.. సంతానం అకీరా, ఆద్య, పొలినా, మార్క్ శంకర్‌ల పేరిట డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్న‌ట్లు వివ‌రించారు. పవన్ కళ్యాణ్ వద్ద చేతిలో నగదు నిల్వ రూ.4,76,436 కాగా, ఆయన భార్య అన్నా వద్ద రూ. 1.53,500గా చూపారు. పవన్ పేరిట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3,10,18,731, ఐసీఐసీఐలో సేవింగ్స్ ఖాతాలో రూ.1,30,50,093, హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ ఖాతాలో రూ.27,064, సీటీ బ్యాంకులో రూ.89,20,828, ఇండస్ బ్యాంకు లో రూ.43,828 ఉన్నాయి. భార్య అన్నా పేరిట ఐసీఐసీఐలో రూ.13,872, హెచ్‌డీఎఫ్‌సీలో 46,845, హెచ్‌డీఎఫ్‌సీలో ఎఫ్‌డీ రూ.6,90,671, రష్యన్ బ్యాంకు ఆర్‌ఎఐఎఫ్‌లో రూ.3,51,117, మరో ఖాతాలో రూ.8,42,107 ఉన్నాయి. పవన్ సంతానం కే అకీరా పేరిట రూ.1,36,36,476, ఆద్య పేరిట రూ.1,00.80,636, పోలినా పేరిట రూ.29,58,966, మార్క్ శంకర్ పేరిట రూ.2,52,510 ఉన్నట్లుగా నామినేష‌న్ లో పేర్కొన్నారు.

ఆభ‌ర‌ణాలు ఇలా..అప్పులు ఇలా..

ఆభ‌ర‌ణాలు ఇలా..అప్పులు ఇలా..

అలాగే పవన్ వద్ద 312 గ్రా. బంగారు, వజ్రాభరణాల విలువ రూ.27.08 లక్షలు, భార్య అన్నా పేరిట 215 గ్రా. బంగారు, వజ్రాభరణాలు విలువ రూ.9.52 లక్షలుగా చూపారు. పవన్ పేరిట మెర్సిడెస్ బెంజ్ రూ.72,92,264, టయోటా ఫార్చ్యున్ రూ.27.5 లక్షలు, స్కోడా రేపిడ్ రూ.27.67 లక్షలు, మహేంద్ర స్కార్పియో రూ.13.82 లక్షలు, వోల్వో కారు రూ.1.07 కోట్లు, హార్లీ డేవిడ్‌సన్ మోటారు సైకిల్ రూ.32.66 లక్షలు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు- వ్యవసాయ భూములు 4 ఎకరాలు రూ.4,02,500, మరో వ్యవసాయ భూమి 4.02 ఎకరాలు విలువ రూ.4,24,615, మరో స్థిరాస్తి 10 ఎకరాలు విలువ రూ.2.76 కోట్లుగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో 1458, 753, 600 చదరపు గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మంగళగిరిలో 0.9 ఎకరాల స్థలం, 2.07 ఎకరాల స్థలంతో పాటు శేరిలింగంపల్లిలో 1050 చదరపు గజాల నివాస స్థలం ఉన్నాయి. ఇక బ్యాంకులు, వ్యక్తులు, సినీ నిర్మాణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.32 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న విద్యార్హ‌త ప‌దో త‌ర‌గ‌తి గా పేర్కొన్నారు. ఆయ‌న 1984 లో నెల్లూరు లోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో ఎస్ఎస్ఎల్‌సి పాస‌య్యారు. ఇదే విష‌యాన్ని అఫిడిట్ లో పేర్కొన్నారు.

గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

వ‌దిన కు..త్రివిక్ర‌మ్ కు బాకీ..

వ‌దిన కు..త్రివిక్ర‌మ్ కు బాకీ..

తాను వివిధ చిత్ర నిర్మాణ సంస్థలకు, వ్యక్తులకు 34 కోట్ల మేర అప్పు ఉన్నట్లు పవన్ త‌న అఫిడవిట్ లో వెల్ల‌డించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 2.4 కోట్ల అప్పు ఉన్నట్లు..అదే విధంగా, ఇక తన వదిన కొణిదెల సురేఖకు కూడా 1.7 కోట్ల అప్పు ఉన్న‌ట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థ నుంచి 25 లక్షలు తీసుకుని ఉన్నట్లు పవన్ తెలిపారు. కొంద రు ఇతర వ్యక్తులకు కూడా బాకీ పడ్డట్లు అఫిడవిట్ లోవెల్ల‌డించారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ రోజు భీమ‌వ‌రంలో నామినే ష‌న్ దాఖలు చేయ‌నున్నారు.

English summary
Janasena Chief pawan Kalyan submitted his Fiancial status as assets and liabilities in his election affadavit. He filed nomination from Gajuwaka Assembly constituency. Pawan has 52 cr assets and 34 cr loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X