ఒకరంటే ప్రేమ.. మరొకరంటే ప్రాణం: జగన్ ఫ్లెక్సీలో పవన్, బాలయ్య ఫొటోల కలకలం

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాగా, ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

జగన్ పక్కనే బాలకృష్ణ ఫొటో

జగన్ పక్కనే బాలకృష్ణ ఫొటో

మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ జగన్‌ ఫోటో పక్కన ఓ పక్క కృష్ణ, మరోపక్క నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాకయ్యారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన వ్యక్తి వైకాపా కార్యకర్త అయినప్పటికీ బాలకృష్ణ అభిమాని అని.. అందువల్లే ఈ విధంగా ఈ ఫ్లెక్సీని పెట్టినట్లు స్థానికులు తెలిపారు.

మీసం మెలేస్తూ బాలయ్య

మీసం మెలేస్తూ బాలయ్య

అటు చంద్రవరంలో బాలకృష్ణ, జగన్, వీరిద్దరి మధ్యలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో జగన్ చిరునవ్వు చిందిస్తూ ఉంటే.. బాలయ్య మాత్రం మీసాన్ని మెలేస్తున్న ఫొటోను పెట్టడం విశేషం.

పవన్ అంటే ప్రాణం.. జగన్ అంటే ప్రేమ

పవన్ అంటే ప్రాణం.. జగన్ అంటే ప్రేమ

‘పవన్ అంటే ప్రాణమిస్తాం... జగన్ అంటే ప్రేమిస్తాం' అంటూ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడంతో పాదయాత్రకు వచ్చిన వారందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. జగన్ మరో రెండు రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని, రాజమండ్రి బ్రిడ్జ్ మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు.

గతంలోనూ ఇలానే..

గతంలోనూ ఇలానే..

కాగా, ఇలా హీరోల ఫొటోలు వైయస్ జగన్‌ ఫ్లెక్సీల్లో ఉండటం కొత్తేమీ కాదు. గతంలో దివంగత నేతలు వైయస్సార్, ఎన్టీఆర్‌‌ల ఫొటోలతో వైయస్ జగన్, జూనియర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్ ఉన్న పెద్ద ఎత్తున హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా వైయస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సందర్భంలో హనుమాన్ జయంతికి దర్శనమిచ్చాయి. ఇలా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున హీరోల ఫ్లెక్సీల్లో జగన్ ఫొటోలు దర్శనమివ్వడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+