బాబును హిందూపురం అడిగిన హరి, అక్కడే బాలకృష్ణ

Pawan to join OMG shoot in May
హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం లోకసభ స్థానం నుండి బరిలో దిగాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ యోచిస్తున్నారు. మంగళవారం హరికృష్ణ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. తాను హిందూపురం లోకసభ స్థానం నుండి పోటీకి దిగుతానని ఆయన చంద్రబాబు వద్ద ప్రస్తావన తెచ్చినట్లుగా తెలుస్తోంది.

హిందూపురం అసెంబ్లీకి బాలకృష్ణ

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన చంద్రబాబు చెవిలో వేసినట్లుగా చెబుతున్నారు. లెజెండ్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న బాలయ్య రెండు మూడు రోజుల్లో మరోసారి చంద్రబాబును కలవనున్నారు.

లెజెండ్ ఘన విజయం నేపథ్యంలో బాలయ్యమంగళవారం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తాను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగానే పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం ఆయనను లోకసభకు పంపించాలని చూస్తున్నారు. బాలయ్య అసెంబ్లీకి పోటీ చేస్తే... టిడిపి అధికారంలోకి వచ్చాక తనకు ఇబ్బందిగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. అంతేకాకుండా బాలయ్య లోకసభకు పోటీ చేస్తే పలు జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

కాగా, అన్నదమ్ములిద్దరు హిందూపురం పైనే దృష్టి సారించడం గమనార్హం. హరికృష్ణ హిందూపురం లోకసభ స్థానం నుండి, బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని యోచిస్తుండటం గమనార్హం. అయితే, ఇరువురు వేర్వేరు ప్రాంతాల నుండి పోటీ చేస్తే పార్టీకి లాభిస్తుందని టిడిపి క్యాడర్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+