Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘మీ ఇంట్లోని వారికి ఆ వీడియో చూపండి’ ఆ రెండు ఛానెళ్లపై తీవ్రంగా స్పందించిన పవన్

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ ప్రముఖ మీడియా సంస్థ(టీవీ9) యజమాని శ్రీనిరాజు నోటీసులు పంపారు. తనను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.

Recommended Video

    సోదరీమణులతో వ్యాపారం చేస్తున్నవారిని బైకాట్ చేయండి.

    అంతేగాక, ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనిరాజు తన తరపు న్యాయవాది నుంచి నోటీసులు పంపారు. పవన్ తనపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన తరపు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు.

    వారికీ పవన్‌కి తేడా లేదా?

    నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే... మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. శ్రీనిరాజు తెలుగు రాష్ట్రాల్లోని అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. టీవీ9తో తన శ్రీనిరాజుకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని, టీవీ9ను నిర్వహించే సంస్థలోనే ఆయన పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు.

    పవన్ ఎంత బాధపడ్డారో..

    వర్మ, రవిప్రకాశ్‌తో కలిసి శ్రీనిరాజు.. టీడీపీ నేతలకు సాయం చేస్తున్నారని, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించాలని చెప్పడం కేవలం ఊహాజనితమేనని అన్నారు. తన క్లైంట్ అన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఆరోపణలు చేసినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారో, ఇప్పుడు పవన్ చేసిన ఈ నిరాధారమైన వ్యాఖ్యలు తన క్లయింట్ కూడా అంతే బాధపడ్డారని నోటీసులో పేర్కొన్నారు.

    అభిప్రాయం మారదంటూ పవన్..

    కాగా, శ్రీని నోటీసులను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నా తల్లిని మళ్లీ మళ్లీ అసభ్య పదజాలం వినిపిస్తూ అవమానించిన మీ టీవీ9ఛానల్ సీఈఓ రియల్ అజ్ఞాతవాసిరవిప్రకాశ్, మీకు శ్రీసిటీ బ్లెస్ చేసిన మీ రాజకీయ పెద్దలపై నా అభిప్రాయం మారదు. గుడ్‌లక్ శ్రీని' అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

    తీవ్రంగా స్పందించిన పవన్

    మరో ట్వీట్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీ టీడీపీ డ్రీమ్ టీం(నా తల్లిపై అసభ్యంగా మాట్లాడించి, ప్రచారం చేసిన బృందంలో మీరు ఒక సభ్యులు) ఓపెన్ హార్ట్ ఆర్కే.. ఈ వీడియో(నా తల్లిని దూషించిన)ను లోకేష్, స్నేహితులు, సీఎం, మీ ఇంట్లోని మహిళలుకు చూపించి వారి అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదు' అని పవన్ ప్రశ్నించారు.

    ఇంట్లోవారికి చూపించి..

    ఆ తర్వాత ‘గుడ్‌లక్ ఆర్కే' అంటూ పవన్ వీడియో ట్వీట్ చేశారు. ‘టీవీ9 శ్రీనిరాజు.. ఈ వీడియోను మీ తల్లి, భార్య, కూతురుకు చూపించి టీవీ9 సాధించిన విజయాన్ని, కుటుంబ ఆదాయాన్ని పెంచిన తీరును వివరించు' అని పవన్ వ్యాఖ్యానించారు. అంతేగాక, కొంత సమయం తర్వాతకు మీకు ప్రత్యేకంగా నా వాదన వినిపిస్తానంటూ రవిప్రకాశ్‌నుద్దేశించి పవన్ ట్వీట్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+