పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నోవా తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. పరస్పర అవగాహన, గౌరవంతోనే తాము విడిపోవాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నామని తెలిపారు. దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ఈ ప్రకటనలో, వివాహ బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా స్పష్టం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు, మానసిక ప్రశాంతతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా పిల్లల పెంపకం, ఎదుగుదల విషయంలో తమ ఉమ్మడి బాధ్యతలను ఎప్పటికీ నెరవేరుస్తామని వారు ఆ ప్రకటనలో వివరించారు.

పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా వివాహం 2013 డిసెంబరులో జరిగింది. 2011లో విడుదలైన తీన్ మార్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య తొలిసారిగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహ బంధానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ అన్నా కొణిదెల కీలక సందర్భాల్లో తోడుగా నిలిచారు. వైవాహిక జీవితం నుంచి వేర్వేరు మార్గాల్లో పయనించాలని వారు తీసుకున్న నిర్ణయం పట్ల రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పాత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పవన్ కల్యాణ్ జాతకానికి సంబంధించి వీడియో అది. పవన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడుదొడుకులు, మానసిక సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని వేణు స్వామి అప్పట్లో తేల్చి చెప్పారు. ఒకవైపు ప్రజా జీవితంలో గొప్ప విజయం సాధించిన సమయంలోనే, వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చన్న వేణుస్వామి 2024లోనే అంచనా వేశారు.
Visionary Venu Swamy!!#100PercentStrikeRateInDivorce https://t.co/aRYD2fZPFu
— Sai Chowdary (@saiholicc) November 9, 2026
పవన్ కల్యాణ్ రాజకీయంగా ఉన్నత స్థితికి చేరినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉంటాయని, ఆయన నాలుగో పెళ్లి చేసుకుంటాడనీ వెల్లడించారు వేణు స్వామి. ఇప్పుడది నిజమైంది. గతంలో అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహ బంధంలో సమస్యలు వచ్చి విడిపోతారని ఆయన ముందే చెప్పిన మాటలు నిజమవ్వడం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే పవన్ కల్యాణ్, అన్నా లెజ్నోవా కూడా విడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
