అంబటి కూతురు పెళ్లికి పవన్ కల్యాణ్, జగన్: వైసిపి టైటానికి పడవలాంటిదని వివేకా
గుంటూరు/ నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు కూతురు మనోజ్ఞ వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు పలు పార్టీల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వివాహ వేడుకకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పవన్, జగన్‌లను చూసేందుకు వేడుకకు వచ్చినవారు ఉత్సాహం చూపించారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ పార్టీ టైటానిక్ పడవ లాంటిదని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందా రెడ్డి అన్నారు. టైటానిక్ పడవ మునిగినట్లే వైసీపీ కూడా మునిగిపోవడం ఖాయమని ఆయన అన్నారు.

ఏ క్షణంలోనైనా అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళతారని ఆనం వివేకా అన్నారు. దానికితోడు జగన్‌ను నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునుగుతారని జగన్ అనుచరులకు ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications