వుమెన్ వింగ్: తొలి జాబితా విడుదల చేసిన పవన్ కళ్యాణ్, ఎవరెవరు అంటే?
అమరావతి: దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని, ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఆడపడుచులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

అన్ని పార్టీలకు భిన్నంగా.. తొలి జాబితా విడుదల చేసిన పవన్
మహిళా శకత్తి రాజకీయ సాధికారత సాధించాలనే తలంపుతో రెండు దశాబ్దాలుగా తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తూ తీర్చిదిద్దిన జనసేన పార్టీ కమిటీలను జనసేనాని శుక్రవారం ఆవిష్కరించారు. సమకాలిన రాజకీయ పార్టీల కమిటీ నిర్మాణాలకు భఇన్నంగా, భవిష్యత్తు భారతావని అవసరాల దృష్ట్యా ఈ కమిటీల రూపకల్పన చేశారు. ఈ కమిటీలు పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో పని చేస్తాయి. ఈ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అనేక ప్రజా ఉపయోగ కౌన్సెల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. తొలుత ఆఢపడుచులతో కమిటీల ఏర్పాటు శుభప్రదంగా భావించారు.

ఈ కమిటీల్లో వీరంతా
ప్రతి ఒక్కరి సమాచారం పవన్ కళ్యాణ్‌కు చెందిన కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రస్తుతం పదవులు పొందిన వారు నవవయస్కులు, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐటీ నిపుణులు. వీరితో పాటు గృహిణులు కూడా ఉన్నారు. కెరీర్‌ను వదులుకొని ప్రజా సేవ కోసం వచ్చిన ఆడపడుచులు చాలామంది ఉన్నారు. మరికొందరు సీనియర్ నాయకులకు వారి అనుభవం, సామర్థ్యాన్ని బట్టి అవకాశం కల్పించారు. ఇది తొలి జాబితా.

వీరమహిళ చైర్మన్‌గా సీఏ విద్యార్థిని
వుమెన్ వింగ్ (వీరమహిళ)కు చైర్మన్‌గా కర్నూలుకు చెందిన జవ్వాజి రేఖ (25)ను నియమించారు. ఈమె సీఏ విద్యార్థిని. ఆడిటర్‌గా పని చేస్తూ పార్టీకి సేవలు అందిస్తున్నారు. వైస్ చైర్మన్లుగా సింధూరి కవిత (25), షేక్ జరీనా (28), నూతాటి ప్రియా సౌజన్య (30), శ్రీవాణి (47) నియమితులయ్యారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు వీరు నిత్యం శ్రమిస్తారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజాత
పార్టీ పొలిటికల్ అపైర్స్ కమిటీలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సుజాత పాండాకు చోటు కల్పించారు. పాలసీ వింగ్ చైర్మన్‌గా డాక్యర్ యామినీ జ్యోత్సా కంబాలను నియమించారు. పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోను పలువురు మహిళలకు చోటు కల్పించారు. పార్లమెంటరీ వర్కింగ్ కమిటీల వనితలుగా షాహిన్ సయ్యద్, షేక్ రజియా, మంజుల సునీత, సావిత్రి, వాశిలి తుషార బిందులు ఉన్నారు.

క్యాంపెయినిగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్‌గా ఉషశ్రీ
క్యాంపెయినిగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్‌గా ఉషశ్రీ పినిషెట్టి (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)ని నియమించారు. జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మి కుమారి, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా పద్మావతిలను నియమించారు. సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీలో (మహిళా విభాగం) శ్యామల, రత్నమాల రెడ్డి, విజయలక్ష్మి, పద్మ, ధనలక్ష్మిలకు చోటు కల్పించారు. కమ్యూనిటీ అండ్ సోషల్ జస్టిస్ వింగ్‌లో జానీబేగంకు చోటు కల్పించారు. లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీలో స్వరూపా దేవి (వైస్ చైర్మన్)ని నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సాయి తేజస్వి, సౌజన్య, కే పద్మలు నియమితులయ్యారు. కాన్‌స్టిట్యూషన్ అండ్ సివిల్ రైట్స్ విభాగం వైస్ చైర్మన్‌గా కవితను నియమించారు.

జనసేన ఏడు సిద్ధాంతాలు
ఇక, జనసేన ఏడు సిద్ధాంతాలతో ముందుకు వెళ్తోంది. ఈ సిద్ధాంతాల ప్రాధాన్యాన్ని, వాటి విలువ, సమాజానికి వాటి అవసరం వంటివి తెలియజెప్పటంతో పాటు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక విధులు పార్టీ ఐడియాలజీ వింగ్ పైన ఉన్నాయి. ఇందులో సుధేష్ణ వల్లూరి, రమ్య కవిత పోతరాజు, జవ్వాది విష్ణు ప్రియాంక, వెంకటసృజన ప్రియ తదితరులు ఉన్నారు. ప్రోటోకాల్స్ కమిటీలో లిఖిత తాడికొండ, శివరాణి గన్నవరపు, శివపార్వతి, శ్రీదేవిలకు అవకాశమిచ్చారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం స్పోక్స్ పర్సన్‌గా వాణిశ్రీ కావూరిని నియమించారు. ఎలక్షన్ ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన వర్షిణి లోకంకు స్థానం దక్కింది.












Click it and Unblock the Notifications