ఏం విడిచి పెట్టాము: పవన్ కళ్యాణ్ ట్వీట్, ఈసారి విభిన్నంగా..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్‌లో స్పందించారు. పోలీసుల ఫిర్యాదు పైన, ఏపీ ఎంపీల తీరు పైన ఇటీవల పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఆయన వీటిని పక్కన పెట్టి సమాజానికి సూటి ప్రశ్న సంధించారు.
యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాము, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు కలలు కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప అంటూ ట్వీట్ చేశారు.
"యువతరానికి ఏ సంపద విడిచి పెట్టాం,యుద్ధము రక్తము కన్నీరు తప్ప,గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు కలలు కలలు తప్ప,పిరికితనం మోసం తప్ప."Seshendra
— Pawan Kalyan (@PawanKalyan) July 11, 2015 కాగా, అంతకుముందు తమ పార్టీ ఎంపీలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంపై చంద్రబాబు రెండు రోజుల క్రితం ఢిల్లీలో స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాట్లాడుతూ... ‘మీరు అడగకపోయినా నా అంతట నేను చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు' అని ఆయన అన్నారు.
"He that is Good for making excuses is seldom Good for anything else." Benjamin Franklin
— Pawan Kalyan (@PawanKalyan) July 11, 2015 అదే సమయంలో, సమస్యలు పరిష్కారం కావడంపై దృష్టి కేంద్రీకరించకుండా జఠిలం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదని ఇలాంటి సమయంలో అంతా సంయమనం పాటించాలన్నారు.
‘మనది కొత్త రాష్ట్రం. రాజధాని లేదు. సమస్యలున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇవన్నీ ఒక్క రాత్రిలో పరిష్కారం కావు. అందరి సహకారం తీసుకుని కష్టపడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమస్యల నుంచి బయటపడేందుకు చూడాల'ని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications